Plasma Donation Awareness Program(Photo-Twitter)

ప్లాస్మా దానంపై సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో అవగాహన సదస్సు(Plasma Donation Awareness) జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి (Rajamouli, Keeravani), సైబరాబాద్‌ కమిషనర్‌ సజ్జనార్‌ ( V. C. Sajjanar) తదితరులు పాల్గొన్నారు. ప‌్ర‌జ‌ల్లో ప్లాస్మాపై అనేక అపోహ‌లుండేవ‌ని, వీటిని పోగొట్టేందుకు అనేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించామ‌ని సైబ‌రాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ తెలిపారు. వీటికి చిరంజీవి, నాగార్జున, విజయ్ దేవరకొండ, రాజమౌళి, కీరవాణి సహకరించారని పేర్కొన్నారు. కీరవాణి ప్లాస్మా యోధులకోసం ఒక పాట కూడా రూపొందించారని తెలిపారు. ఈ సంధర్భంగా ప్లాస్మా దానం చేసిన పలువురికి సీపీ స‌జ్జ‌నార్‌, ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి, సంగీత ద‌ర్శ‌కుడు కీరవాణి ప్రోత్సాహ‌కాలు అందించారు.

కరోనాను జయించిన రాజమౌళి ప్లాస్మా ఇవ్వటానికి ముందుకు రావటం శుభ పరిణామ‌మ‌ని స‌జ్జ‌నార్ కొనియాడారు. కరోనా సోకితే ఎవ‌రూ ఆందోళన చెందవద్దని కోరారు. ప్లాస్మా దానానికి అంద‌రూ ముందుకు రావాల్సిందిగా పిలుపునిచ్చారు. ప్లాస్మా వివరాలు అన్ని పొందుపరుస్తూ Donateplasma.scsc.in అనే వెబ్‌సైట్‌ను రూపొందించామ‌న్నారు. తమతో క‌లిసి అనేక స్వచ్చంద సంస్థలు కలిసి పనిచేస్తున్నాయని, చాలా మంది యువత, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు వలంటీర్లుగా పనిచేస్తున్నార‌ని చెప్పారు.

Here's Plasma Donation Awareness Song:

ప్లాస్మా దానం చేసేవాళ్లే రియల్ హీరోస్ అని డైరెక్టర్ రాజమౌళి అన్నారు. ప్లాస్మా దానం చేయడానికి భయపడకూడదన్నారు. తాను కూడా ప్లాస్మా దానం చేస్తానన్నారు. ప్రతి ఒక్కరూ ప్లాస్మా దానం చేయడానికి ముందుకు వస్తున్నారన్నా.. కుటుంబ సభ్యులు భయపడుతున్నారన్నారు . ప్లాస్మా దానం చేయడం వల్ల ఏమి కాదని..ప్లాస్మా దానం చేసే వారిని ఎవరు ఆపొద్దన్నారు. కరోనా రోగుల కోసం దేశంలో తొలిసారిగా ప్లాస్మా బ్యాంక్‌ ఏర్పాటు

ప్లాస్మా దానం అనేది డాక్టర్ చేతిలో ఉన్న బ్రహ్మస్రమన్నరు. ఎటువంటి అపోహలు లేకుండా ప్లాస్మా దానం చేయాలన్నారు. కరోనా అనేది చంపేంతా పెద్ద వైరస్ కాదన్నారు. కరోనా వచ్చిన వారు ధైర్యంగా పోరాడాలని కోరారు. సకాలంలో కరోనాను గుర్తిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. కరోనా విషయంలో ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దని కోరారు. పౌష్ఠికాహారం తీసుకుంటూ.. వైద్యులు సూచించిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటే కరోనాను జయించవచ్చన్నారు.

కీరవాణి మాట్లాడుతూ.. ప్లాస్మా దానంపై అపోహలు, అనుమానాలు పెట్టుకోవద్దన్నారు. కొవిడ్‌ నుంచి కోలుకున్న వారు ప్లాస్మాదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్లాస్మా అనేది ప్రాణాలు కాపాడే సంజీవినితో సమానమన్నారు. తమ కుటుంబం, సిబ్బంది ప్లాస్మా దానం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.