Arvind Kejriwal (Photo Credits: ANI)

Delhi, June 29: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న క‌రోనా వైర‌స్ చికిత్స‌లో ప్లాస్మా థెరపి ఇప్పుడు కీల‌కంగా మారిన విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలో త‌మ రాష్ట్రంలో ప్లాస్మా బ్యాంక్‌ను (Plasma Bank in Delhi) ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Delhi CM CM Arvind Kejriwal) తెలిపారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... కోవిడ్‌19 (COVID-19) రోగుల చికిత్స కోసం ప్లాస్మా కొర‌త ఉన్న‌ద‌ని, ఆ స‌మ‌స్య‌ను అధిగ‌మించేందుకు ఐఎల్‌బీఎస్ హాస్పిట‌ల్‌లో ప్లాస్మా బ్యాంక్‌ను ప్రారంభించ‌నున్న‌ట్లు ఢిల్లీ సీఎం తెలిపారు. 24 గంటల్లో 19 వేల కేసులు నమోదు, దేశంలో 5.5 లక్షలకు చేరువలో కరోనా కేసులు, ఒకే రోజు 380 మంది కరోనాతో మరణం

కోవిడ్ నుంచి కోలుకున్న వారు ప్లాస్మాను (plasma) దానం చేయాల‌ని ఆయ‌న అభ్య‌ర్థించారు. డాక్ట‌ర్ అసీమ్ గుప్తా కుటుంబానికి కోటి న‌ష్ట‌ప‌రిహారాన్ని ఇవ్వ‌నున్న‌ట్లు సీఎం కేజ్రీవాల్ వెల్ల‌డించారు. ఎల్ఎన్‌జేపీ హాస్పిట‌ల్ డాక్ట‌ర్ అసీమ్ గుప్తా మృతి ప‌ట్ల సీఎం కేజ్రీ విచారం వ్య‌క్తం చేశారు. డాక్ట‌ర్ అసీమ్ లాంటి వారి వ‌ల్లే మ‌నం కోవిడ్‌19తో పోరాడుతున్నామ‌న్నారు. ఆ డాక్ట‌ర్ కుటుంబానికి కోటి ప‌రిహారం ఇవ్వ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

Here's ANI Tweet

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 29 మందిపై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించగా.. వాళ్లంతా రికవర్‌‌ అయ్యారని అన్నారు. ఇదిలా ఉంటే ప్లాస్మా బ్యాంక్‌ పెట్టడం దేశంలో ఇదే మొదటిసారి. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లివర్‌‌ అండ్‌ బిలియరీ సైన్స్‌ (ఐఎల్‌బీఎస్‌) హాస్పిటల్‌లో దీన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఢిల్లీ సీఎం చెప్పారు. ప్రైవేట్‌, ప్రభుత్వ హాస్పిటల్స్‌లో చేరే పేషంట్లకు ఇది అందుబాటులో ఉంటుందని అన్నారు. ఐఎల్‌బీఎస్‌ హాస్పిటల్‌లో కరోనా పేషంట్లకు ట్రీట్‌మెంట్‌ ఇవ్వనందున డోనర్లు సేఫ్‌గా అక్కడికి వచ్చి ప్లాస్మా డొనేట్‌ చేయొచ్చని కేజ్రీవాల్‌ అన్నారు.

కరోనా సోకిన వ్యక్తి పరిస్థితి క్రిటికల్‌గా ఉంటే ఈ ప్లాస్మా థెరపీ (Plasma Therapy) ఉపయోగిస్తారు. కరోనా వచ్చి తగ్గిపోయిన వ్యక్తి బ్లడ్‌ ప్లాస్మాను సేకరించి దాన్ని పాజిటివ్‌ వచ్చిన వ్యక్తికి ఎక్కిస్తారు. ఆ ప్లాస్మాలో ఉన్న యాంటీబాడీస్‌ ఇమ్యూనిటీ సిస్టమ్‌ను బూస్ట్‌ చేస్తుంది.

దేశంలో అత్యధికంగా కరోనా వైరస్ కేసులు నమోదయిన రాష్ట్రాల జాబితాలో ఢిల్లీ రెండో స్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం అక్కడ కరోనా వైరస్ బాధితుల సంఖ్య 83వేలు దాటగా.. 2,889 మంది ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలో ఏప్రిల్ నెలలోనే తొలిసారి ప్లాస్మా థెరపీ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించారు. వైరస్ తీవ్రంగా ఉండి.. వెంటిలేటర్‌పై ఉన్న ఓ 49ఏళ్ల వ్యక్తికి ప్లాస్మా చికిత్స చేశారు.