చిత్రసీమలో వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న 'ఆర్జీవీ మిస్సింగ్' సినిమా ట్రైలర్ (RGV Missing Official Trailer) ఆదివారం విడుదలైంది. రామ్ గోపాల్ వర్మ నిన్న ప్రకటించిన విధంగానే దసరా రోజున చెప్పిన సమయం కంటే ఓ 20 నిమిషాలు ముందే ఆర్జీవీ మిస్సింగ్ ట్రైలర్‌ను (Varmas RGV Missing Official Trailer) విడుదల చేశారు.వర్మ మిస్సయిన ఘటనకు సంబంధించి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
తాజాగా విడుదల చేసిన ఈ టీజర్‌లో పలువురు టాలీవుడ్ స్టార్లు, పలువురు రాజకీయ ప్రముఖుల్ని పోలిన నటులు ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పలు పోస్టర్లు విడుదలైన విషయం తెలిసిందే.
కథ విషయానికొస్తే.. ఆర్జీవీ మిస్ అయ్యాడనే షాకింగ్ విషయాన్ని తెలుసుకున్న ఆర్జీవీ సిబ్బంది.. పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. అయితే పోలీసులు దీన్ని కాంట్రవర్షియల్ డైరెక్టర్ ఆర్జీవీ పబ్లిసిటీ స్టంట్‌గా భావించి లైట్ తీసుకుంటారు. కానీ అదే నిజమని నిర్ధారణ అవుతుంది. ఆ తర్వాత ముగ్గురిని నిందితులుగా భావించిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తారు.
Here's Varma Tweet
Here is the trailer of RGV MISSING releasing 20 mints before time #RgvMissing https://t.co/0zHVKUIBap
— Ram Gopal Varma (@RGVzoomin) October 25, 2020
వారి విచారణలో షాకింగ్ విషయాలు తెలుసుకుంటారు. ఈ విధంగా కథ సాగుతుంది. ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే వర్మ ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయనున్నారు. అయితే ఈ చిత్రంలో పలువురు సినిమా నటులు, రాజకీయ నాయకులను టార్గెట్ చేసినట్లుగా ట్రైలర్ ను చూస్తే తెలుస్తోంది.
ఈ కేసులో అనుమానితులుగా పీకే ఫ్యాన్స్, మెగా ఫ్యామిలీ, మాజీ ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు ఉంటారని వర్మ చెప్పారు. ఇందులోని పాత్రలు టాలీవుడ్ స్టార్లను, రాజకీయ నేతలను పోలి ఉన్నాయి. ‘దసరా సందర్భంగా ఆర్జీవీ మిస్సింగ్ ట్రైలర్ విడుదలైంది. ఇది పీకే ఫ్యాన్స్‌కి, ఎం ఫ్యామిలీకి, మాజీ సీఎం, పప్పుకి హ్యాపీ దసరా కాదంటూ వర్మ ఇప్పటికే ట్వీట్ చేశారు. ఈ సినిమాలో పీకే, ఎమ్మెస్, బీ, మాజీ సీఎం, పప్పు, కేపీ, ఆర్కే ఉంటారని తెలిపారు.