Kapil Dev Biopic '83': క్రిస్టమస్‌కు కపిల్‌ దేవ్‌ బయోపిక్ మూవీ, అక్టోబర్ 15న ప్రధాని మోదీ బయోపిక్ విడుదల, రేసులో మరిన్ని సినిమాలు
Ranveer Singh as Kapil Dev in 83. (Photo Credits; Twitter)

క‌రోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా దాదాపు ఏడు నెల‌ల పాటు సినిమా థియేట‌ర్స్ అన్నీ మూత‌ప‌డిన విషయం విదితమే. కేంద్రం సడలించిన అన్‌లాక్‌లో భాగంగా అక్టోబ‌ర్ 15 నుండి థియేట‌ర్స్ తిరిగి తెర‌చుకోనున్నాయి. అయితే ఇప్ప‌టికే చాలా సినిమాలు విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఏ సినిమా ముందు విడుద‌ల అవుతుందా అనే దానిపై పలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

కాగా ప్ర‌ధాని మోదీ జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కిన పీఎం న‌రేంద్ర‌మోదీ బ‌యోపిక్‌ని (PM Narendra Modi biopic) అక్టోబ‌ర్ 15న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్టు ఇప్ప‌టికే ప్ర‌క‌టించ‌గా, తాజాగా మ‌రి కొన్ని సినిమాలు థియేట‌ర్ లో సంద‌డి చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు తెలుస్తోంది. ర‌ణ్‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో క‌బీర్ సింగ్ తెర‌కెక్కించిన చిత్రం 83 (Kapil Dev Biopic '83) చిత్రాన్ని క్రిస్మ‌స్‌కు విడుద‌ల చేయాల‌ని భావిస్తున్న‌ట్టు స‌మాచారం. 1983లో (1983 Cricket World Cup) కపిల్‌ దేవ్‌ సారథ్యంలో భారత జట్టు ప్రపంచకప్‌ను ఎలా సాధించింది అన్న నేపథ్యంతో 83 అనే సినిమా తెర‌కెక్కించారు. క‌బీర్ సింగ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన‌ ఈ చిత్రంలో ర‌ణ్‌వీర్ సింగ్.. క‌పిల్ దేవ్‌గా క‌నిపించ‌నున్నాడు.

వర్మ దిశ మూవీని దయచేసి ఆపండి, హైకోర్టు గడప తొక్కిన దిశ తండ్రి, కేంద్ర ప్రభుత్వం, సెన్సార్ బోర్డు వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు, దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన దిశ లైంగిక దాడి ఘ‌ట‌న

సునీల్‌ గవాస్కర్‌ పాత్రలో బాలీవుడ్‌ నటుడు తాహీర్‌ రాజ్‌ భాసిన్, అప్పటి జట్టు మేనేజర్‌ మాన్‌ సింగ్‌ పాత్రలో పంకజ్‌ త్రిపాఠి, క్రికెటర్లు సందీప్‌ పాటిల్‌ పాత్రలో ఆయన తనయుడు చిరాగ్‌ పాటిల్, శ్రీకాంత్‌ పాత్రలో తమిళ నటుడు జీవా, సయ్యద్‌ కిర్మాణిగా సాహిల్‌ ఖట్టర్, బల్వీందర్‌ సింగ్‌గా అమ్మీ విర్క్‌ కనిపించబోతున్నారు. ఇక రణ్‌వీర్‌కు జోడీగా దీపిక పదుకొణె రోమి అనే పాత్ర‌లో క‌నిపించ‌నుంది. ఏప్రిల్ 10న 83 చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావించ‌గా, క‌రోనా ఎఫెక్ట్‌తో ఈ మూవీని వాయిదా వేశారు. కాగా, క‌రోనా వ‌ల‌న చాలా బాలీవుడ్ చిత్రాలు ఓటీటీలో విడుద‌లైన విష‌యం తెలిసిందే.