గతంలో 'రక్తచరిత్ర', 'వంగవీటి' లాంటి రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాలు రూపొందించి ఎన్నో వివాదాలకు కారణమైన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma), గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా టీడీపీ అధినేత, ఏపి ప్రతిపక్ష నేత చంద్రబాబును విలన్ గా చూపుతూ 'లక్ష్మీ's NTR' సినిమాను తెరకెక్కించి రాజకీయ వేడిని మరింత పెంచారు. ఈ సినిమా తర్వాత రాంగోపాల్ వర్మ 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' (Kamma Rajyam Lo Kadapa Reddlu). అనే సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. అప్పట్నించీ ఈ సినిమాకు సంబంధించి వివాదస్పదంగా ఉండే పోస్టర్లు, టీజర్లు, పాటలు విడుదల చేస్తూ వస్తున్నారు. భారతదేశంలో అత్యంత వివాదరహిత దర్శకులలో రామ్ గోపాల్ వర్మ ఒకడు, వర్మ తీసే ప్రతీ చిత్రం ఒక కళాఖండం. కాకపోతే..
రివర్స్ లో ఇది 'అత్యంత వివాద రహిత సినిమా' (the MOST NON CONTROVERSIAL film ever) అంటూ సరికొత్తగా పబ్లిసిటీ చేసుకుంటూ వస్తున్నారు. ఈ దీపావళి కానుకగా ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తున్నట్లు బంపర్ ఆఫర్ కూడా ప్రకటించారు. అందుకు సంబంధించి ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు. పోస్టర్ గనక చూస్తే అచ్చు గుద్ధినట్లు చంద్రబాబును పోలి ఉన్న వ్యక్తినే సినిమాలో చూపిస్తున్నారు. అలాగే వైఎస్ జగన్ ను కూడా అచ్చంగా దించేశారు.
ఇదే ఆ పోస్టర్
'లక్ష్మీ's NTR' సినిమా తర్వాత ఇప్పుడు ఈ సినిమాలో కూడా ముఖ్యంగా ఏపి ప్రతిపక్ష నేత చంద్రబాబునే వర్మ టార్గెట్ చేసినట్లుగా స్పష్టం అవుతుంది. 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా ద్వారా మరోసారి చంద్రబాబును నెగెటివ్ రోల్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి టీడీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.