 
                                                                 Hyderabad, June 24: నాలుగేళ్ల క్రితం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతో ఆర్జీవి (RGV) సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఎన్నికల ఓటమి తర్వాత సీనియర్ ఎన్టీఆర్ (NTR) జీవితం ఎలా మారింది. ఆయన జీవితంలోకి పార్వతి ఎలా వచ్చింది. వచ్చిన తర్వాత ఏం జరిగింది అనే కాంట్రవర్సీయల్ సబ్జెక్ట్‌తో పెద్ద దుమారమే రేపాడు. ఈ సినిమా రిలీజ్ టైమ్‌లో ఏపిలోని చాలా చోట్ల ఈ మూవీ ప్రదర్శననే నిలిపివేశారు. ఇక ఆ తర్వాత ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ అంటూ మరో కాంట్రవర్సీయల్ సినిమా తీసి చాలా మందికి టార్గెట్ అయ్యాడు. ఇక ఇప్పుడు అదే తరహాలో ‘వ్యూహం’ (Vyooham Movie) అనే సినిమాతో ఏపీ పాలిటిక్స్‌లో హీట్ పెంచడానికి వస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఆర్‌జీవి విడుదల చేసిన ముఖ్య పాత్రల ఫోటోలు నెట్టింట పెద్ద దుమారమే రేపాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు.
టీజర్ (Vyooham Movie Teaser) చూస్తుంటే సినీ, రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ అయ్యేలానే అనిపిస్తుంది. YSR హెలికాఫ్టర్ ప్రమాదం, YSR మరణించిన తర్వాత ఏమైంది, ఎవరు ఎలా రియాక్ట్ అయ్యారు. జగన్ ని అరెస్ట్ చేసే సన్నివేశాలు, జగన్ పార్టీ పెట్టే సన్నివేశాలు టీజర్‌లో చూపించారు. చివర్లో జగన్.. నేనలా చేయడానికి చంద్రబాబుని అనుకున్నావా అనే డైలాగ్‌తో టీజర్‌ను హైలెట్ చేశాడు.
చూస్తుంటే ఈ టీజర్ పెద్ద సంచలనం సృష్టించే విధంగా అనిపిస్తుంది. వంగవీటి సినిమాను నిర్మించిన దాసరి కిరణ్ ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ రెండు భాగాలుగా తెరకెక్కింది. అందులో వ్యూహం తొలిపార్టు కాగా, రెండోది శపథం. తొలిపార్టులో YSR మరణం తర్వాత ఏం జరిగిందని, రెండో పార్ట్‌లో జగన్ ఎలా సీఎం అయ్యాడు అనేది ఆర్జీవి చూపించబోతున్నాడు.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
