మలయాళ ముద్దుగుమ్మ సాయి పల్లవి తెలుగు ఆడియన్స్ లో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. 'ప్రేమమ్' సినిమాతో సౌత్ ఇండియాలో పాపులర్ అయిన ఈ బ్యూటీ తెలుగులో వరుణ్ తేజతో 'ఫిదా', నానితో MCA, శర్వానంద్‌తో 'పడిపడి లేచే మనసు' సినిమాలు చేసింది.
ప్రస్తుతం సాయిపల్లవి తెలుగులో శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో రాబోతున్న 'లవ్ స్టోరీ' అనే సినిమాలో నటిస్తుంది. ఇందులో నాగ చైతన్య హీరో. ఇంకో విశేషం ఏమిటంటే ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌గా మాత్రమే కాదు, కొరియోగ్రఫీ కూడా చేస్తున్నట్లు తెలిసింది.
సాయి పల్లవి మంచి నటి మాత్రమే కాదు, తన డాన్సింగ్ స్కిల్స్‌తో కూడా ఎంతో మందిని ఫిదా చేసింది, తాను స్వతహాగా మంచి శిక్షణ పొందిన డాన్సర్ కూడా. దీనిని దృష్టిలో పెట్టుకొని డైరెక్టర్ శేఖర్ కమ్ముల తన లవ్ స్టోరీలో ఒక పాటకు సాయిపల్లవిని కొరియోగ్రఫీ చేయాల్సిందిగా కోరాడట.
Musical Preview from Love Story:
క్లాస్ రొమాంటిక్ సినిమాలు తీసే శేఖర్ కమ్ముల ఇప్పటికే తన ఫిదా సినిమాతో సాయిపల్లవిని తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర చేశారు, మళ్ళీ ఇప్పుడు రౌడీ బేబీని తన లవ్ స్టోరీలో ఎలా ప్రెజెంట్ చేయనున్నారో అనేది ఆసక్తికరంగా మారింది.
Watch Sai Pallavi's Dance in RowdyBaby Song;
గత ఫిబ్రవరిలో ప్రేమికుల రోజు సందర్భంగా లవ్ స్టోరీ నుంచి 'ఏయ్ పిల్లా..' అంటూ సాగే ఒక చిన్న వీడియో సాంగ్ ను విడుదల చేశారు. ఆ తర్వాత కరోనావైరస్ లాక్డౌన్ కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. ఇప్పుడు త్వరలోనే రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ ప్రారంభించబోతున్నట్లు సమాచారం.