టాలీవుడ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నిర్మాత కొడాలి బోసుబాబు (Kodali Bosubabu Dies) కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. దివంగత దాసరి నారాయణరావుకు ఈయన బంధువు అవుతారు. దాసరి పద్మకు సోదరుడి వరుస. తొలుత దాసరి సినిమాలకు ప్రొడక్షన్ మేనేజర్ గా చేసిన బోసుబాబు ఆ తర్వాత నిర్మాతగా మారారు. ఏయన్నార్ తో ‘రాగదీపం’, ఏయన్నార్, కృష్ణలతో ‘ఊరంతా సంక్రాంతి’, కృష్ణతో ‘ప్రజాప్రతినిధి’, శోభన్ బాబు తో ‘జీవనరాగం’, దాసరి తో ‘పోలీస్ వెంకటస్వామి’ తదితర చిత్రాలు నిర్మించిన ఆయన ఆదివారం గుండెపోటుతో హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు.
ఆయనకు 66 ఏళ్లు. దర్శక రత్న దాసరికి ఆయన దూరపు బంధువు. దాసరి పద్మకు సోదరుడి వరుస. దాసరి చిత్రాలకు ప్రొడక్షన్ మేనేజర్‌గా పని చేసిన బోసుబాబు ఆయన ఆశీస్సులతోనే నిర్మాతగా మారారు. బోసుబాబుకు భార్య, నలుగురు పిల్లలు. బోసుబాబు మృతికి పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు తమ సంతాపం తెలియచేశారు.