Subramanian Swamy. (Photo Credits: ANI/File)

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో (Sushant Singh Rajput Death case) నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి (Subramanian Swamy) సోమవారం సంచలన ఆరోపణలు చేశారు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ (Sushant Singh Rajput) విష ప్రయోగం వల్లే మరణించాడంటూ బీజేపీ సీనియర్‌ నేత సంచలన ఆరోపణలు చేశారు. సుశాంత్‌ కడుపులో ఉన్న విషం ఆనవాలు లేకుండా పోయేంత వరకు వేచిచూసి.. ఆ తర్వాతే శవ పరీక్ష నిర్వహించారన్నారు. నటుడి మృతదేహానికి (Sushant Dead Body) పోస్ట్‌మార్టం నిర్వహించడంలో ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేశారని.. హంతకుల రాక్షస మనస్తత్వం, వారి చెడు ఉద్దేశాల గురించి త్వరలోనే బయటపడుతుందని ఆయన పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే సుశాంత్‌ సన్నిహితుడిగా పేరొందిన సందీప్‌ సింగ్‌ తీరుపై కూడా సుబ్రహ్మణ్య స్వామి పలు అనుమానాలు వ్యక్తం చేశారు. అతడు పదే పదే దుబాయ్‌కు వెళ్లాల్సిన అవసరం ఏంటని, ఈ విషయాలపై కూడా విచారణ జరగాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. బాలీవుడ్ నటుడు సుశాంత్‌ మృతికి కారకులైన వారి వివరాలు వెల్లడయ్యే సమయం ఆసన్నమైందని చెప్పుకొచ్చారు. ఈ మేరకు సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్‌ చేశారు.

Here's Subramanian Swamy Tweets

కాగా సుశాంత్‌ హత్య జరిగిన రోజున దుబాయ్‌ కంప్లైంట్‌ డ్రగ్‌ డీలర్‌ అయాష్‌ ఖాన్‌ సుశాంత్‌ సింగ్‌ను కలిశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాక సుశాంత్‌ కేసు మాదిరిగానే ప్రముఖ నటి శ్రీదేవి, కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ భార్య సునంద పుష్కర్‌ మృతి కేసులను కూడా సీబీఐ విచారించాలని డిమాండ్‌ చేశారు. సునంద పోస్ట్ మార్టం రిపోర్ట్ గురించి మాట్లాడుతూ.. సునంద పోస్ట్‌ మార్టం చేసిన తర్వాత ఆమె కడుపులో వెలికి చూసిన వాటితోనే నిజం ఏంటనేది తెలిసింది. కానీ శ్రీదేవి, సుశాంత్‌ కేసులో ఇది జరగలేదు. అంతేకాక సుశాంత్‌ హత్య జరిగిన రోజు దుబాయ్‌ డ్రగ్‌ డీలర్‌ అయాష్‌ ఖాన్‌ సుశాంత్‌ని కలిశాడు ఎందుకు’ అని స్వామి తన ట్వీట్‌లో ప్రశ్నించారు.

Subramanian Swamy Tweet

సుశాంత్‌ మృతితో దుబాయ్‌కు సంబంధాలు ఉండవచ్చని ఆయన ఆరోపించారు. ఇజ్రాయెల్, యూఏఈ దౌత్య సంబంధాలతో, భారతదేశానికి చెందిన దుబాయ్ దాదాలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారన్నారు. సుశాంత్, శ్రీదేవి, సునంద హత్య కేసుల సమాచారం కోసం సీబీఐ మొసాద్, షిన్ బెత్ సహాయం తీసుకోవాలని స్వామి ఆగస్టులో ట్వీట్ చేశారు కూడా.. శ్రీదేవి 2018 ఫిబ్రవరిలో దుబాయ్ హోటల్‌లోని బాత్‌టబ్‌లో మునిగిపోయి మరణించిన సంగతి తెలిసిందే. సునంద పుష్కర్ 2014 జనవరి 17న న్యూ ఢిల్లీలోని ఒక హోటల్ గదిలో అనుమానస్పద రీతిలో చనిపోయారు. సుశాంత్ నా కొడుకు లాంటివాడు, అతని కుటుంబానికి న్యాయం జరగాలి, సుశాంత్ తండ్రి కేకే సింగ్‌ రెండో పెళ్లి వ్యాఖ్యలపై స్పందించిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్

సుశాంత్ మృతి కేసు దర్యాప్తు కోసం గత వారం ముంబై చేరుకున్న సీబీఐ బృందం, నటుడి స్నేహితుడు సిద్ధార్థ్ పిథాతో పాటు నీరజ్ సింగ్‌ను సోమవారం మరోసారి ప్రశ్నించింది. ముంబైలోని శాంతక్రూజ్ ప్రాంతంలోని డీఆర్‌డీఓ గెస్ట్ హౌస్ వద్ద వీరిద్దరిని ప్రశ్నించారు. అంతేకాక సీబీఐ అధికారులు ఈ రోజు సుశాంత్‌ రెండు నెలలు బస చేసిన వాటర్‌స్టోన్ రిసార్ట్‌ను కూడా సందర్శించారు. అక్కడ ఉన్న సమయంలో సుశాంత్ ఎలా ప్రవర్తించాడో తెలుసుకోవడానికి సీబీఐ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం సీబీఐ ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న సంగతి తెలిసిందే.

ముంబై పోలీసుల విచారణలో సుశాంత్‌ హౌస్‌కీపర్‌ నీరజ్‌ సింగ్‌ కీలకాంశాలు వెల్లడించాడు. ఆయన మాటల్లో..

రోజులానే జూన్‌ 14న నేను ఉదయం 6.30 గంటలకి లేచాను. ఆ తర్వాత కుక్కలను బయటకు తీసుకెళ్లాను. 8 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చిన తరువాత గదులు, మెట్లు శుభ్రం చేశాను. ఇంతలో సుశాంత్‌ సార్‌ తన గది నుంచి వచ్చి చల్లటి నీరు అడిగితే తీసుకెళ్లి ఇచ్చాను. వాటర్‌ తాగి హాల్‌ శుభ్రం చేశావా అని నన్ను ప్రశ్నించి.. నవ్వుతూ తన గదిలోకి వెళ్లారు. ఆ తరువాత, ఉదయం 9:30 గంటలకు, నేను హాల్ శుభ్రం చేస్తున్నప్పుడు, కేశవ్ (కుక్) అరటిపండ్లు, కొబ్బరి నీళ్ళు, జ్యూస్‌ తీసుకుని సార్ గదిలోకి వెళ్లడం చూశాను. కేశవ్ తిరిగి వచ్చి, సార్ కొబ్బరి నీళ్ళు, జ్యూస్‌ మాత్రమే తీసుకున్నారని చెప్పాడు’ అని తెలిపాడు. సుషాంత్ సింఘ్ రాజ్‌పుట్ కేసు సీబీఐకి, కేసు విచారణకు సహకరించాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన అత్యున్నత న్యాయస్థానం

ఆ తర్వాత ‘ఉదయం 10:30 గంటలకు, మధ్యాహ్నం భోజనానికి ఏం చేయాలో తెలుసుకునేందుకు కేశవ్ మళ్ళీ సార్ గదికి వెళ్లాడు. అతను తలుపు తట్టాడు కాని గది లోపలి నుంచి లాక్ చేసి ఉంది.. ఎటువంటి స్పందన లేదు. దాంతో కేశవ్‌ సార్ నిద్రపోతున్నాడని భావించి కిందకు వచ్చాడు. ఈ విషయాన్ని దీపేశ్, సిద్ధార్థ్‌లకు చెప్పాడు. వారు కూడా గదికి వెళ్లి తలుపు మీద కొట్టడం ప్రారంభించారు. వారు చాలా సేపు తలుపు తట్టారు కాని లోపలి నుంచి ఎలాంటి స్పందన లేదు.

దాంతో దీపేశ్ దిగి వచ్చి దాని గురించి నాకు చెప్పాడు. నేను కూడా సార్ గదికి వెళ్లి తలుపు తట్టాను కానీ తెరవ లేదు. ఇంతలో సిద్ధార్థ్, సార్ ఫోన్‌కి కాల్‌ చేశాడు. కాని సార్ రూమ్ డోర్ తెరవలేదు.. ఫోన్‌కు సమాధానం ఇవ్వలేదు. మేము గది తాళం కోసం వెతకడం ప్రారంభించాము. అయితే అప్పుడు అవి మాకు దొరకలేదు. దాంతో దీని గురించి సుశాంత్‌ సోదరి మీతు దీదీకి చెప్పాం. ఆమె తాను బయలుదేరానని.. గది తలుపులు తెరవమని మాకు చెప్పారని నీరజ్‌ అన్నాడు.

తాళం తీయడానికి సిద్ధార్థ్ ఒక కీ మేకర్‌ను పిలిచాడు. వాళ్లు వచ్చారు కాని వారు ఎక్కువ సమయం తీసుకుంటున్నందున వారిని వెంటనే పంపేశారు. ఆ తర్వాత మిగతా పనివారి సాయంతో తలుపులు పగలగొట్టి గదిలోకి ప్రవేశించారు. అప్పుడు గదిలో చీకటిగా ఉంది, ఏసీ ఆన్‌లోనే ఉంది. దీపేశ్ లైట్ ఆన్ చేశాడు. ఆ తర్వాత సిద్ధార్థ్ లోపలకు వెళ్లి వెంటనే బయటకు వచ్చాడు. అతని వెనుక, నేను లోపలికి వెళ్ళాను. ఆ తర్వాత సుశాంత్ సోదరి మీతు వచ్చారు. రాగానే‘ గుల్షన్ తూనే యే క్యా కియా ’అని అరవడం ప్రారంభించారు. ఆ తర్వాత పోలీసులను పిలిచారు’ అని ముంబై పోలీసులకు హౌస్‌కీపర్‌ నీరజ్‌ సింగ్‌ తెలిపాడు.