Jana Sena gets recognition from Central Election Commission(X)

జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది. ఆ పార్టీకి గాజు గ్లాస్ చిహ్నాన్ని రిజర్వ్ చేస్తూ పవన్ కళ్యాణ్‌కు లేఖ పంపింది ఈసీ. ఇంతకాలం రిజిస్టర్డ్ పార్టీగా ఉన్న జనసేన.. గుర్తింపు పొందిన పార్టీగా మారడంతో ఆ గుర్తును ఇకపై ఎవరికీ కేటాయించరు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన 21 అసెంబ్లీ స్థానాలు గెలుపొందింది. అలాగే 2 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించింది. పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో విజయం సాధించింది జనసేన.

కూటమి ప్‌రభుత్వం ఏర్పాడిన అనంతరం ఏపీ డిప్యూటీ సీఎంగా ఎన్నికైన పవన్... తనదైన మార్క్ చూపిస్తు ముందుకు సాగుతున్నారు.

ఇక డిప్యూటీ సీఎం అంశం ఏపీ రాజకీయల్లో పెను ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే ఈ అంశంపై దృష్టి సారించిన టీడీపీ హైకమాండ్ వివాదానికి ముగింపు పలికే విధంగా చర్యలు తీసుకుంది. ఈ అంశంపై ఎవరూ బహిరంగంగా మాట్లాడొద్దని పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఇదే అంశంపై జనసేన కేంద్ర కార్యాలయం కూడా స్పందించింది. డిప్యూటీ సీఎం అంశంపై జనసేన నేతలు, కార్యకర్తలు బహిరంగంగా మాట్లాడొద్దని, సోషల్ మీడియాలో స్పందించవద్దని ఆదేశాలు జారీ చేసింది.డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ మాట్లాడవద్దు, నేతలకు ఆదేశాలు జారీ చేసిన జనసేన కేంద్ర కార్యాలయం

Jana Sena gets recognition from Central Election Commission