Mumbai, Aug 14: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు తండ్రితో సత్సంబంధాలు లేవని, తండ్రి రెండో వివాహం చేసుకోవడం పట్ల సుశాంత్ సంతోషంగా లేరని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి విదితమే. తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవడంతో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) తన కొడుకు లాంటివాడని, అతడి కుటుంబానికి న్యాయం జరగాలని పేర్కొన్నారు. అయితే ఈ వివాదంపై సుశాంత్ బంధువు, బీజేపీ ఎమ్మెల్యే అయిన నీరజ్ కుమార్ సంజయ్ రౌత్‌కు నోటీసులు పంపారు. కేకే సింగ్ రెండో పెళ్లి అవాస్తవమని, అనవసర వ్యాఖ్యలు చేసిన సంజయ్ రౌత్ 48 గంటల్లో బహిరంగంగా క్షమాపణలు చేప్పాలని లేకుంటే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు.
ఈ నోటీసులపై స్పందించిన శివసేన ఎంపీ.. సుశాంత్ కేసులో (Sushant Singh Rajput Suicide Case) తనకు తెలిసిందే చెప్పానని, తానేదైనా తప్పుగా మాట్లాడితే ఆ విషయాన్ని పరిశీలిస్తానని తెలిపారు. తనకు అందిన సమాచారం ప్రకారమే అలా మాట్లాడానని, సుశాంత్ కుటుంబం వారి వద్ద ఉన్న సమాచారం ఆధారంగా మాట్లాడుతున్నారని రౌత్ అన్నారు. సుశాంత్ తన కొడుకు లాంటి వాడని, బాలీవుడ్ తమ కుటుంబమని పేర్కొన్నారు. నటుడి కుటుంబంతో ఎలాంటి శత్రుత్వం లేదని, అతడి కుటుంబానికి న్యాయం జరగాలనే తాము కోరుకుంటున్నామన్నారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ కేసులో సీబీఐ దూకుడు, రంగంలోకి దిగుతూనే నటి రియా చక్రవర్తి సహా ఆరుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు
సుశాంత్ ఆత్మహత్య వెనక ఉన్న కారణాలను బహిర్గతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. సుశాంత్ కుటుంబ సభ్యులపై తనకు సానుభూతి ఉందని, వాస్తవాలు వెలుగు చూసే వరకు ఓపికతో ఉండాలని వారికి సూచించినట్లు తెలిపారు. తన వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరించారని, తనసలు బెదిరించలేదని స్పష్టం చేశారు. సుశాంత్ కేసు దర్యాప్తులో ముంబై పోలీసులపై (Mumbai Police) నమ్మకం ఉంచాలని కోరారు. ఒకవేళ వారు సరిగా పనిచేయడం లేదని అనుకుంటే అప్పుడు సీబీఐను ఆశ్రయించాలని సంజయ్ రౌత్ అన్నారు. సుశాంత్ కేసుకు రాజకీయ రంగు, బీహార్ రాష్ట్ర పోలీసు అధికారి వినయ్ తివారీని క్వారంటైన్‌కి తరలించిన ముంబై పోలీసులు, ఖండించిన సీఎం నితీష్ కుమార్
సుశాంత్ మృతిపై రాజకీయ కుట్ర జరుగుతోందని, ముంబై పోలీసుల నుంచి దర్యాప్తును ఎందుకు హడావిడిగా తప్పిస్తున్నారని రౌత్ అన్నారు. ముంబైలో ఘటన జరిగితే సుశాంత్ మృతిపై పట్నాలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని సుశాంత్ విషాదాంతం చోటుచేసుకున్న 40 రోజుల తర్వాత కుటుంబ సభ్యులు బయటకు వచ్చారని వ్యాఖ్యానించారు.