Raghavendra Rao

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ షేక్‌పేట పరిధిలో రెండు ఎకరాలు (ఆర్‌కే సినీప్లెక్స్ ఉన్న స్థలం) కేటాయింపును సవాల్ చేస్తూ 2012లో దాఖలైన పిల్‌లో ప్రముఖ సినీ దర్శకుడు కె. రాఘవేంద్రరావు , ఆయన సోదరుడు కె. కృష్ణమోహన్‌రావు, ఆయన కుటుంబసభ్యులకు తెలంగాణ హైకోర్టు గురువారం నోటీసులు జారీ చేసింది. బంజారాహిల్స్‌లోని సర్వే నంబర్‌ 403/1లో రికార్డింగ్‌, రీ-రికార్డింగ్‌ థియేటర్‌ నిర్మించేందుకు ఎకరానికి రూ.8,500 చొప్పున భూమి ఇచ్చారు.

టీడీపీ ప్రభుత్వం 2003లో మినీ థియేటర్, ఫిల్మ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్, కాన్ఫరెన్స్ హాల్ నిర్మాణానికి అనుమతి ఇచ్చింది.అయితే ఆ కుటుంబం కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించింది. దీన్ని సవాల్ చేస్తూ 2012లో హైకోర్టులో పిల్ దాఖలైంది.గతేడాది కోర్టు నోటీసులు జారీ చేసినా అక్నాలెడ్జిమెంట్ రాలేదు. దీంతో హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి నోటీసులు జారీ చేసి జనవరి మూడో వారానికి విచారణ వాయిదా వేసింది.

మోకాలీ సర్జరీ తర్వాత ఇటలీ నుంచి హైదరాబాద్‌కు తిరిగొచ్చిన ప్రభాస్.. ఫోటోస్ వైరల్

రాఘవేంద్రరావుకు ప్రభుత్వం కేటాయించిన బంజారాహిల్స్‌లోని రెండెకరాల భూమిని రద్దు చేయాలని మెదక్‌కు చెందిన బాలకిషన్‌ గతంలో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ మేరకు తాజాగా రాఘవేంద్రరావుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం రాయితీ ధరతో ప్రభుత్వం భూమి కేటాయిస్తే.. వారు దాన్ని షరతులకు విరుద్ధంగా వాడుతున్నారని ఆయన పిల్ దాఖలు చేశాడు.