Suddala Ashok Teja: నేను మీ దయతో బాగానే ఉన్నాను, పుకార్లు నమ్మకండి, వీడియో ద్వారా సందేశాన్ని పంపిన గేయ రచయిత సుద్దాల అశోక్‌ తేజ
Suddala Ashok Teja (Photo-Video Grab)

ప్రముఖ తెలుగు సినిమా గేయ రచయిత సుద్దాల అశోక్‌ తేజ (Suddala Ashok Teja) తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులను ఖండించారు. తను ఆరోగ్యంగానే ఉన్నానని ఓ వీడియో ద్వారా స్పష్టం చేశారు. ఆరోగ్యం విషమించిందనే వార్తల్లో (health condition) ఎలాంటి నిజం లేదని అలాంటి పుకార్లు నమ్మవద్దని కోరారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. కరోనాతో హాలీవుడ్ న‌టుడు మృతి, కోవిడ్-19తో పోరాడి ఓడిన నిక్ కార్డెరో, బుల్లెట్స్ ఓవ‌ర్ బ్రాడ్‌వే చిత్రానికి సంగీతంలో ఉత్తమ నటుడిగా టోనీ అవార్డు అందుకున్న కెనడా సూపర్ స్టార్

‘మిత్రులకు, శ్రేయాభిలాషులకు, పాట అంటే ఇష్టపడే ప్రతి ఒక్కరికి నమస్కారం.మీ అందరి ప్రేమ వల్ల, ప్రభుత్వ సహాయ, సహకారాల వల్ల కాలేయ మార్పిడి చికిత్స (liver transplant surgery) అనంతరం.. రోజురోజుకు కోలుకుంటున్నాను. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాను. మళ్లీ పాటలు రాస్తున్నాను. కరోనా నేపథ్యంలో అందరిలాగే జాగ్రత్తలు తీసుకుంటున్నాను. నా ఆరోగ్యంలో ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే అశోక్‌ తేజ ఆరోగ్యం విషమంగా ఉందని కొన్ని వార్తలు వినబడుతున్నాయి. అందులో ఎలాంటి నిజం లేదు’ అని తెలిపారు. కరోనావైరస్ ఉండటం వల్ల ప్రస్తుత పరిస్థితులను బట్టి ప్రజలందరి మాదిరిగానే జాగ్రత్తగా ఉండాల్సి వస్తోంది తప్ప.. నా ఆరోగ్యంలో ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు.

Here's Suddala Ashok Teja Video

తెలుుగ సినీ పరిశ్రమలో జాతీయ అవార్డును అందుకున్న అతి తక్కువ మంది గేయ రచయితల్లో సుద్దాల అశోక్ తేజ‌ ఒకరు. చిరంజీవి హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ‘ఠాగూర్’ సినిమాలోని ‘నేను సైతం’ పాట‌కు సుద్దాల జాతీయ అవార్డు అందుకున్నారు. కేవలం సినిమా పాటలే కాకుండా తెలంగాణ యాసలో విప్లవాత్మక పాటలు కూడా అశోక్ తేజ రాస్తుంటారు. సినిమాల్లో 2 వేలకు పైగా పాటలను అశోక్ తేజ రాశారు.