తెలుగు చిత్ర సీమలో ఇటీవల వరకు షూటింగ్ లు నిలిపివేత జరిగిన విషయం మనకి తెలిసిందే. అయితే దానిపై సుదీర్ఘ చర్చలు జరిపిన ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెప్టెంబర్ 1 నుంచి షూటింగ్ లు మొదలుపెట్టమని సూచనలు ఇచ్చింది. దీంతో ఆ చర్చల సారాంశాన్ని ఓ ప్రకటనగా విడుదల చేసింది ఫిల్మ్ ఛాంబర్. ఆ ప్రకటనలో నటీనటుల రెమ్యూనరేషన్ లు, కాల్ షీట్లు వివరాలు, ఓటీటీ-శాటిలైట్ హక్కులు వంటి అంశాలపై కొత్త మార్గదర్శకాలని విడుదల చేసింది. ఈ నెల(సెప్టెంబర్) 10 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి.
సినిమా నిర్మాణానికి సంబంధించి నిర్ణయాలు ఇవీ.
* నటులు/ సాంకేతిక నిపుణులకు రోజువారీ వేతనాల చెల్లింపులు ఉండవు.
* పర్సనల్ స్టాఫ్, లోకల్ ట్రాన్స్‌పోర్ట్, హోటల్ బస, ప్రత్యేక ఆహారం లాంటివన్నీ కలుపుకునే రెమ్యూనరేషన్ లెక్కేస్తారు. అంటే అందులోనూ అన్నీ చూసుకోవాలి.
* పాత్రలు, చిత్రాలను బట్టి రెమ్యూనరేషన్‌ను నిర్మాత నిర్ణయిస్తారు.
* ఒప్పందానికి మించి నిర్మాతలు నేరుగా నగదు లాంటివి ఇవ్వకూడదు. కీలక సాంకేతిక నిపుణుల విషయంలోనూ ఇదే నిర్ణయం వర్తిస్తుంది.
* ఆయా సినిమాల చిత్రీకరణ ప్రారంభంలోనే అగ్రిమెంట్ చేసుకోవాలి. వాటికి తప్పనిసరిగా ఛాంబర్ ఖరారు చేయాలి.
* స్క్రిప్టు అప్‌డేట్స్, కాల్ షీట్లు లాంటి కీకల వివరాలను రోజూ నోట్ చేయాలి.
ఓటీటీ విషయంలో కొత్త మార్గదర్శకాలు ఇవీ.
* ఓ సినిమా థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలి.
* ఓటీటీ, శాటిలైట్ హక్కులు ఏ సంస్థలు దక్కించుకున్నాయి అనే వివరాలను టైటిల్ కార్డ్స్‌లో, ప్రచారంలో ప్రకటించకూడదు
సినిమా పంపిణీ, ప్రదర్శన విషయంలో ఇలా..
* వర్చువల్ ప్రింట్ ఫీజు (వీపీఎఫ్) అంశంపై ఇంకా చర్చలు సాగుతున్నాయట. ఆరో తేదీన మరోసారి భేటీ అయ్యి నిర్ణయం తీసుకుంటారని సమాచారం.
* తెలంగాణలో తరహాలోనే ఆంధ్రప్రదేశ్‌లోని మల్టీప్లెక్స్‌లకు కూడా వీపీఎఫ్ పర్సెంటేజీ అందుతుందట.
ఫెడరేషన్ విభాగానికి సంబంధించి..
* ఫెడరేషన్ గురించి ఇంకా చర్చలు తుది దశలో ఉన్నాయట. దీనిపై ఓ నిర్ణయానికి వచ్చాక. రేట్ కార్డుల వివరాలను త్వరలో అన్ని నిర్మాణ సంస్థలకు అందిస్తారు.