Credits: Twitter

Hyderabad, October 28: 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో సమంతకు (Samantha) అక్కగా (Elder Sister) నటించిన కల్పిక గణేశ్ (Kalpika Ganesh) టాలీవుడ్ (Tollywood) యువ కమెడియన్ అభినవ్ గోమటం (Abhinav Gomatam)పై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇటీవల కల్పిక గణేశ్ ఓ కార్యక్రమంలో ఉత్తమ సహాయనటి అవార్డు అందుకుంది.

వినూత్న హెయిర్ కట్ కోసం సెలూన్ కు వెళ్లిన కుర్రాడు.. జుట్టుకు మంటల సెగ తగిలేలా చేసిన క్షురకుడు.. ఒక్కసారిగా భగ్గుమన్న మంటలు.. కుర్రాడికి తీవ్రగాయాలు.. గుజరాత్ లో ఘటన

అయితే, అభినవ్ గోమటం తనను ఐటెం అంటూ అవమానకరంగా వ్యాఖ్యానించాడని కల్పిక మండిపడుతోంది. అంతేకాదు, అభినవ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, అలాగే తనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.

సమంతతో అప్పుడే ప్రేమలో పడిపోయా.. ఆమె ఏంచేసినా నాకు నచ్చుతుంది. ఇప్పుడు కూడా ఆమెను ఆరాధిస్తున్నా.. స్యామ్ పై తన అభిమానాన్ని వెల్లడించిన విజయ్ దేవరకొండ

ఈ క్రమంలో ఆమె తెలంగాణ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ట్యాగ్ చేస్తూ, అభినవ్ పై చర్యలు తీసుకోవాలని కోరింది.  అటు, అభినవ్ గోమటం మాత్రం సారీ చెప్పేందుకు ససేమిరా అంటున్నాడు. కల్పిక ఉద్దేశపూర్వకంగానే తనను టార్గెట్ చేసిందని ఆరోపిస్తున్నాడు.