ప్రముఖ తెలుగు నటి కౌసల్య పెళ్లి చేసుకోకవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పెళ్లిపై నాకు ఎలాంటి వ్యతిరేకత లేదు. సరైన వ్యక్తి.. జీవితంలోకి అడుగుపెడితే మ్యారేజ్ అనేది చాలా అందంగా ఉంటుంది. పెళ్లి గురించి నేను ఎన్నో ఆలోచించాను. అది నాకు సెట్ కాదేమో అని మొదట్లో అనుకునేదాన్ని. నాకు తగ్గ వ్యక్తి దొరకడేమో అని భయపడ్డాను . కానీ ఎందుకో రిలేషన్ నాకు సెట్ కాలేదు. దీంతో పేరెంట్స్‌తో ఉండాలని ఫిక్సయ్యాను'
'తల్లిదండ్రులతో ఉన్నప్పుడూ పెళ్లి గురించి ఆలోచన వచ్చింది. ఒకవేళ పెళ్లి చేసుకుంటే అత్తమామలతో ఎలా ఉంటానో అని కంగారుపడ్డాను. ఇలా ఆలోచనలు ఎక్కువయ్యేసరికి కొన్నాళ్లు మ్యారేజ్ అనే దానికి దూరంగా ఉన్నాను. అప్పట్లో నేను అనారోగ్యం బారినపడ్డాను. బరువు పెరిగాను. యాక్ట్ చేసిన సినిమాలు సంతృప్తి ఇవ్వలేదు. దీంతో అన్ని విషయాల నుంచి బ్రేక్ తీసుకున్నాను' అని నటి కౌసల్య చెప్పుకొచ్చింది.
'ఏప్రిల్ 19' అనే మలయాళ సినిమాతో నటిగా మారిన కౌసల్య తెలుగు, తమిళ, మలయళ సినిమాల్లో నటించింది. అల్లుడుగారు వచ్చారు, పంచదార చిలక చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది.తర్వాత గౌరి, రారండోయ్ వేడుక చూద్దాం, హీరో తదితర చిత్రాల్లో సహాయ నటిగా అలరించింది.