
తెలుగు నటి సమంత మయోసైటిస్ తో బాధపడుతున్నట్టు ఇటీవలే ప్రకటించడంగా తాజాగా మరో ప్రముఖ నటి మరో వ్యాధి బారీన పడినట్లు వెల్లడించింది. ప్రముఖ తెలుగు నటి పూనమ్ కౌర్ (Tollywood Actress Poonam Kaur) తనకు ఫైబ్రో మయాల్జియా వ్యాధి నిర్ధారణ అయినట్టు తెలిపింది.
తనకు ఫైబ్రో మయాల్జియా సోకినట్టు పూనమ్ కౌర్ ఇన్ స్టా గ్రామ్ ద్వారా వెల్లడించింది. శరీరం అంతటా తీవ్రమైన నొప్పి, అలసట, డిప్రెషన్ ఫైబ్రో మయాల్జియా వ్యాధి ( diagnosed with Fibromyalgia) లక్షణాలు. దీన్ని చూసిన అభిమానులు జాగ్రత్తలు తీసుకుని, త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు పెడుతున్నారు.
పాపులర్ అవుతున్నప్పుడు ఇలాంటివి మాములే, ఈడీ 12 గంటల విచారణ అనంతరం విజయ్ దేవరకొండ వ్యాఖ్యలు
ప్రస్తుతం పూనమ్ కౌర్ నటించిన నాతి చరామి సినిమా విడుదల కావాల్సి ఉంది. ‘‘ఎన్నో ప్రణాళికలతో ఉత్సాహంగా ఉన్న వ్యక్తిని ఫైబ్రో మయాల్జియా, నిదానించి విశ్రాంతి తీసుకునేలా చేసింది’’అంటూ పూనమ్ కౌర్ ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ లో పేర్కొంది. ఇటీవలే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న సమయంలో.. పూనమ్ కౌర్ ఆయనతో కలసి కొంత దూరంపాటు పాల్గొనడం తెలిసిందే.