gopichand

టాలీవుడ్ హీరో గోపిచంద్‌ ‘సీటీమార్’ మంచి హిట్‌గా నిలిచిన సంగతి విదితమే. అయినప్పటికీ గోపిచంద్‌కు కావ‌లిసినంత గుర్తింపు మాత్రం రావ‌డంలేదు. తాజాగా ప్ర‌స్తుతం ఈయ‌న న‌టించిన ‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్’ విడుద‌లకు సిద్ధంగా ఉంది. సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ మారుతి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం జూలై 1న విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలో చిత్ర‌బృందం ప్ర‌మోష‌న్ల‌ను జోరుగా జ‌రుపుతుంది. కాగా ప్ర‌మోష‌న్లలో భాగంగా గోపిచంద్ సినిమాపై ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డిస్తూ ప్రేక్ష‌కుల‌లో క్యూరియాసిటీ పెంచుతున్నాడు.

ప్ర‌మోష‌న్‌లో భాగంగా గోపిచంద్‌ను (Tollywood Hero Gopichand) ప్ర‌భాస్ సినిమాలో మిమ్మల్ని విల‌న్‌గా అడిగితే చేస్తారా అని యాంక‌ర్ అడిగింది. బదులుగా గోపిచంద్ ప్ర‌భాస్‌తో (Rebal Star Prabhas) చేస్తా, క్యారెక్ట‌ర్ అంతా ఏమి చూసుకోను, ప్ర‌భాస్ అడిగితే ఏ క్యారెక్ట‌ర్ అయినా చేస్తా అంటూ ప్ర‌భాస్‌తో సాన్నిహిత్యాన్ని గుర్తుచేశాడు. వీరిద్ధ‌రు ఇండ‌స్ట్రీలోకి రాక‌ముందు నుండే ప‌రిచ‌య‌మ‌య్యారు. వ‌ర్షం సినిమాతో క్లోజ్ అయ్యారు. గోపిచంద్‌కు ఇండ‌స్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్ ప్ర‌భాస్ అంటూ ప‌లు సంద‌ర్భాల్లో చెప్పిన విష‌యం తెలిసిందే.

ఇక‌నైనా ఎద‌గండి గాయ్స్, నాగ చైతన్య ఫ్యాన్స్‌కు సమంత వార్నింగ్, మా మీద ఫోకస్ మాని మీ ప‌నిమీద, కుటుంబాల మీద శ్ర‌ద్ధ‌పెట్టండంటూ ట్వీట్

ప‌క్కాక‌మ‌ర్షియ‌ల్ చిత్రంలో గోపిచంద్ స‌ర‌స‌న రాశీఖన్నా హీరోయిన్‌గా న‌టించింది. స‌త్య‌రాజ్‌, శ్రీనివాస్ రెడ్డి, అన‌సూయ‌, రావుర‌మేష్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించారు. యూవీ క్ర‌యేష‌న్స్‌, జీఎ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌ల‌పై బ‌న్నివాస్‌, వంశీ, ప్ర‌మోద్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. జేక్స్ బేజోయ్ సంగీతం అందించాడు. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జూన్ 26న జ‌రుగునుంది. మెగాస్టార్ చిరంజీవి ఈ వేడుక‌కు గెస్ట్‌గా రాబోతున్నాడు.