
ప్రముఖ సినీ నటుడు ప్రభు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన (Tollywood Veteran actor Prabhu) చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గత కొద్ది రోజులుగా ఆయన కిడ్నీ సంబంధిత సమస్యలతో (kidney stones treatment) బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం(ఫిబ్రవరి 21న) ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని కేలంబాక్కంలోని మెడ్వే ఆస్పత్రికి తరలించారు.ప్రభుని పరీక్షించిన వైద్యులు యురేత్రోస్కోపీ లేజర్ సర్జరీ ద్వారా కిడ్నీలోని రాళ్లను తొలగించారు.
ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ.. ప్రభు ఆర్యోగం ప్రస్తుతం నిలకడగా ఉందని, లేజర్ సర్జరీ ద్వారా ఆయన కిడ్నీలో రాళ్లను తొలగించామన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడుతున్నట్లుగా (Prabhu Health Update) తెలిపారు.మరో రెండు రోజుల్లో ప్రభును డిశ్చార్జ్ చేయనున్నట్లు వైద్యులు పేర్కొన్నారు.
కాగా తమిళ నటుడైన ప్రభు తెలుగులో ఆయన చంద్రముఖి, డార్లింగ్, శక్తి చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు. ప్రభాస్‌కు డార్లింగ్ చిత్రంలో ఆయన పోషించిన తండ్రి పాత్ర తెలుగు ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. ఇటీవల ప్రభు దళపతి విజయ్ వారసుడు చిత్రంలో కనిపించారు.