కొత్త సంవత్సరం వేళ టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ప్రముఖ సినీ నటుడు, సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నర్సింగ్ యాదవ్(52) (Narsing Yadav Dies) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో (Narsing Yadav Dies With Kidney Failure) బాధపడుతున్నారు. నగరంలోని సోమాజిగూడలో గల యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతుండగానే ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో గురువారం ఆయన తుదిశ్వాస (Actor Narsingh Death) విడిచారు.
నర్సింగ్ యాదవ్ 1968 జనవరి 26న హైదరాబాద్‌లో జన్మించారు. హేమాహేమీలు చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించారు. నర్సింగ్ యాదవ్‌కు భార్య చిత్ర యాదవ్, కొడుకు రుత్విక్ యాదవ్ ఉన్నారు. నటుడిగా నర్సింగ్ యాదవ్‌కు దర్శకుడు రాంగోపాల్ వర్మ బ్రేక్ ఇచ్చారు. వర్మ ప్రతీ మూవీలో నర్సింగ్ యాదవ్‌కు తప్పనిసరిగా ఓ క్యారెక్టర్ ఇస్తూ వచ్చారు.
Narsing Yadav Death News:
ప్రముఖ తెలుగు సినీ నటుడు నర్సింగ్ యాదవ్ కన్నుమూశారు. అనారోగ్యంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. ఇవాళ తుదిశ్వాస విడిచారు. నర్సింగ్ యాదవ్ అనేక తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలు పోషించి మెప్పించారు. #NarsingYadav #OmShanthi pic.twitter.com/LB6sOZAb5v
— BARaju (@baraju_SuperHit) December 31, 2020
ఠాగూర్, శంకర్‌దాదా ఎంబీబీఎస్, మాస్టర్, పోకిరి, యమదొంగ, అన్నవరం, జానీ, సై, నువ్వొస్తానంటే నేనొదంటానా, ఇడియట్, గాయం, క్షణక్షణం, మాయలోడు, అల్లరి ప్రేమికుడు తదితర చిత్రాల్లో నర్సింగ్ యాదవ్ నటించారు.నర్సింగ్ యాదవ్‌కు భార్య చిత్ర యాదవ్, తనయుడు రుత్విక్ యాదవ్ ఉన్నారు.
విలన్ పాత్రలు వేసినా.. కామెడీగా చేసిన పాత్రలతో మంచి పేరు సంపాదించారు. తాను చేసిన ప్రతీ పాత్రలో ఆయన జీవించారు. కామెడీ చేసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. కాగా నర్సింగ్ యాదవ్ అసలు పేరు మైలా నరసింహ యాదవ్. సినీ పరిశ్రమలో అందరూ ఆయన్ని నర్సింగ్ యాదవ్ గా పిలిచేవారు.