Thirty Years Prudhvi: ‘థర్డీ ఇయర్స్ ఇండస్ట్రీ’ పృథ్వీకి ఫ్యామిలీ కోర్టు షాక్.. భార్యకు ప్రతి నెల రూ. 8 లక్షల భరణం చెల్లించాలని ఆదేశం! అసలు ఏమైందంటే?
Prudhvi (File Photo)(Photo Credits: Twitter)

Vijayawada, October 1: ‘థర్డీ ఇయర్స్ ఇండస్ట్రీ’, బాయిలింగ్ స్టార్ బబ్లూగా టాలీవుడ్‌లో (Tollywood) తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ కమేడియన్ పృథ్వీరాజ్‌కు (PrudviRaj) విజయవాడ ఫ్యామిలీ కోర్టులో (Family Court) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భార్య శ్రీలక్ష్మికి ప్రతి నెల రూ. 8 లక్షల భరణం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. విజయవాడకు చెందిన శ్రీలక్ష్మి-పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన బాలిరెడ్డి పృథ్వీరాజ్ (శేషు)కి 1984లో వివాహమైంది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. శ్రీలక్ష్మి 2017లో కోర్టును ఆశ్రయిస్తూ.. భర్త నుంచి తనకు నెలకు రూ. 8 లక్షల భరణం ఇప్పించాలని కోరారు. పెళ్లయిన తర్వాత తన భర్త పృథ్వీరాజ్ విజయవాడలోని తమ ఇంట్లోనే ఉంటూ చెన్నై వెళ్లి సినిమాల్లో నటించేందుకు ప్రయత్నించేవాడని, ఆ ఖర్చులన్నింటినీ తన తల్లిదండ్రులే భరించేవారని పేర్కొన్నారు. అంతేకాకుండా తనను తరచూ వేధించేవాడని ఆరోపించారు. 2016లో తనను ఇంటి నుంచి గెంటేశాడని, దీంతో మరో దారిలేక పుట్టింటికి చేరుకున్నానని ఆ ఫిర్యాదులో శ్రీలక్ష్మి పేర్కొన్నారు.

మీరు లోపల వేసుకొనే అండర్ వేర్ కూడా డ్రెస్ కోడ్ నిబంధనలను పాటించాలి.. పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్ వింత రూల్.. దుమ్మెత్తిపోసిన నెటిజన్లు.. వెనక్కి తగ్గిన సంస్థ

సినిమాలు, టీవీ సీరియళ్ల ద్వారా పృథ్వీరాజ్ నెలకు రూ. 30 లక్షలు సంపాదిస్తున్నారని, ఆయన నుంచి తనకు నెలకు రూ. 8 లక్షల భరణం ఇప్పించాలని కోరారు. కేసును విచారించిన కోర్టు శ్రీలక్ష్మికి అనుకూలంగా తీర్పు చెప్పింది. ప్రతి నెల 10వ తేదీ నాటికి శ్రీలక్ష్మికి రూ. 8 లక్షల భరణం చెల్లించాలని ఆదేశించింది.