This Week Movies- OTT Releases: ప్రతీవారం లాగే ఈవారం కూడా మరిన్ని కొత్త సినిమాలు మిమ్మల్ని అలరించనున్నాయి. ఫిబ్రవరి 16, 2024న థియేటర్లలో విడుదలైన సినిమాలు, క్లుప్తంగా వాటి రివ్యూలు, అలాగే ఈరోజు నుంచి వివిధ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉండనున్న సినిమాలు, వెబ్ సిరీస్‌ల వివరాలు, రాబోయే చిత్రాల విశేషాలను ఇక్కడ తెలియజేస్తున్నాం.
ఈ వారం థియేటర్లలో రిలీజైన సినిమాల్లో సందీప్ కిషన్ నటించిన 'ఊరుపేరు భైరవకోన', రాజకీయ నేపథ్యంలో వచ్చిన 'రాజధాని ఫైల్స్' వంటి సినిమాలు ట్రెండింగ్ లో ఉన్నాయి. మిగతావి చాలా వరకు చిన్న సినిమాలు, మిగిలిపోయిన సినిమాలు రిలీజ్ అయ్యాయి. కొన్ని సినిమాలు రీరిలీజ్ కూడా అవుతున్నాయి.
కాబట్టి వాటిని థియేటర్లకు వెళ్లి చూడాలా? ఓటీటీ రిలీజ్ వరకు ఆగాలా అన్నది మీ ఇష్టం.
ఈవారం థియేటర్లలో విడుదలైన కొత్త సినిమాలు
- ఊరు పేరు భైరవకోన (తెలుగు): సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ, వెన్నెల కిషోర్ తదితరులు నటించిన ఫాంటసీ థ్రిల్లర్ సినిమా. కథా నేపథ్యం బాగుంది, కానీ సెకండాఫ్ కథనం నెమ్మదిగా సాగుతుంది అని చాలా మంది రివ్యూలు ఇస్తున్నారు.
- రాజధాని ఫైల్స్ (తెలుగు): ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, అమరావతి రాజధాని అంశంతో రూపొందిన సినిమా. ఒక వర్గం వారికి నచ్చుతుంది.
- వూడో తిరిగి వచ్చింది (హిందీ డబ్బింగ్): నటీనటులు తెలియని.. హారర్ థ్రిల్లర్ మూవీ
- మేడమ్ వెబ్ (ఇంగ్లీష్): డకోటా జాన్సన్ కథానాయికగా నటించిన సైన్స్ ఫిక్షన్ మూవీ
- డ్రిల్ (తెలుగు): హరనాథ్ పొలిచర్ల, కారుణ్య చౌదరి నటించిన మిస్టరీ థ్రిల్లర్
- ప్రవీణ్ ఐపీఎస్ (తెలుగు): నంద కిషోర్, రోజా కుషి, దుర్గా దేవ్ నటించిన డ్రామా మూవీ
వీటితో పాటు ఐ హేట్ లవ్ (తెలుగు), కుచ్ కట్టా హో జాయే, బ్రహ్మయుగం (మళయాలం), ది ల్యాండ్ ఆఫ్ బ్యాడ్ (ఇంగ్లీష్) మొదలైన సినిమాలు రిలీజ్ అయ్యాయి.
ఈవారం ఓటీటీలో రిలీజ్ అవుతున్నవి
ఈవారం ఓటీటీలోకి వచ్చిన సినిమాలు, త్వరలో రాబోయే సినిమాల వివరాలు ఇలా ఉన్నాయి..
- భామా కలాపం2: స్ట్రీమింగ్ - ఆహా
- నా సామి రంగ - 17 ఫిబ్రవరి 2024- డిస్నీ+ హాట్‌స్టార్ ఫిల్మ్
- డంకీ: స్ట్రీమింగ్ - నెట్‌ఫ్లిక్స్
- ది కేరళ స్టోరీ- స్ట్రీమింగ్- జీ5 ఫిల్మ్
- సలార్ (హిందీ వెర్షన్) – స్ట్రీమింగ్ - డిస్నీ+ హాట్‌స్టార్
- ఐన్‌స్టీన్ అండ్ ది బాంబ్ (హాలీవుడ్) : స్ట్రీమింగ్ - నెట్‌ఫ్లిక్స్
ప్రస్తుతం థియేటర్లలో విడుదలవుతున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ టాక్ తెచ్చుకుంటేనే, అవి అక్కడ మనుగడ సాగిస్తాయి. లేదంటే కొన్ని రోజుల్లోనే OTT ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంటాయి. అయితే కొన్ని తెలుగు సినిమాలు థియేటర్లలో విడుదలకు ముందే డిజిటల్ విడుదల తేదీలను ప్రకటిస్తున్నాయి. సాధారణంగా థియేటర్లో విడుదలయిన ఏ సినిమా అయినా కనీసం నెల రోజుల తర్వాత OTTలోకి రావాలి. అయితే చిన్న సినిమాగా విడుదలై పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్ కొట్టిన 'హనుమాన్' సినిమా ఓటీటీ విడుదల కోసం ఇప్పుడు చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ హక్కులను జీ5 ఫిల్మ్ దక్కించుకుంది. మార్చి 02, 2024 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు.