This Week Movies- OTT Releases: నేడే చూడండి..! హనుమాన్ ఓటీటీలోకి వచ్చేస్తోంది, ఈవారం థియేటర్‌లలో విడుదలైన సినిమాలు, సంక్షిప్త రివ్యూలు, ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే కొత్త చిత్రాలు, వెబ్ సిరీస్‌ల విశేషాలు ఇవిగో!
This Week Movies- OTT Releases | Pixabay/file

This Week Movies- OTT Releases:  ప్రతీవారం లాగే ఈవారం కూడా మరిన్ని కొత్త సినిమాలు మిమ్మల్ని అలరించనున్నాయి. 2024 మార్చి 15 శుక్రవారం నాడు థియేటర్లలో విడుదలైన సినిమాలు, క్లుప్తంగా వాటి రివ్యూలు, అలాగే ఈవారం నుంచి వివిధ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉండనున్న సినిమాలు, వెబ్ సిరీస్‌ల వివరాలు, రాబోయే చిత్రాల విశేషాలను ఇక్కడ తెలియజేస్తున్నాం.

ఈవారం థియేటర్లలో కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే ఇందులో అగ్ర హీరోల సినిమాలు, భారీ అంచనాలు ఉన్న సినిమాలు ఏవీ లేవు. తెలంగాణ నేపథ్యంలో వచ్చిన 'రజాకార్' సినిమా పేరు ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఎక్కువగా వినిపిస్తుంది. అలాగే చాలా కాలం గ్యాప్ తర్వాత పూరీ జగన్నాథ్ సోదరుడు సాయిరాం శంకర్ నటించిన 'వెయ్ దరువెయ్' చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇవి కాకుండా మరికొన్ని చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటి వివరాలు ఈ కింద పేర్కొనడమైనది. ఆసక్తి ఉన్నవారు థియేటర్లకు వెళ్లి చూడొచ్చు లేదా ఓటీటీ రిలీజ్ వరకు ఓపిక పట్టొచ్చు.

ఈవారం థియేటర్లలో విడుదలైన కొత్త సినిమాలు

రజాకార్ (తెలుగు): స్వాతంత్య్రానికి ముందు తెలంగాణ సాయుధ పోరాటాల నేపథ్యంలో తెరకెక్కిన చారిత్రక డ్రామా ఇది. రాజ్ అర్జున్, బాబీ సింహా, వేదిక, అనసూయ తదితరులు నటించారు. ఈ సినిమాకు విశ్లేషకులు మంచి రేటింగ్స్ ఇచ్చారు. చారిత్రక ఘట్టాలను కొన్ని కోణాల నుంచి తెలుసుకోవాలనుకునేవారు ఈ సినిమా చూడొచ్చు.

తంత్ర (తెలుగు): అనన్య నాగళ్ల, ధనుష్. ఆర్, సలోని తదితరులు నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ

బస్తర్- ది నక్సల్ స్టోరీ (హిందీ): అదా శర్మ నక్సలైట్ పాత్రలో నటించిన క్రైమ్ డ్రామా ఇది.

యోధ (హిందీ): సిద్ధార్థ్ మల్హోత్రా, రాశి ఖన్నా తదితరులు నటించిన బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.

కుంగ్ ఫూ పాండా 4: 3డీ/4డీ యానిమేషన్ మూవీ

వెయ్ దరువెయ్ (తెలుగు): సాయిరాం శంకర్, యశ శివ, సునీల్, సత్యం రాజేష్ తదితరులు నటించిన యాక్షన్ కామెడీ డ్రామా.

షరతులు వర్తిస్తాయి (తెలుగు): '30 వెడ్స్ 21' యూట్యూబ్ సిరీస్ ఫేమ్ చైతన్య రావు, భూమి శెట్టి తదితరులు నటించిన 'మిడిల్ క్లాస్' డ్రామా

రవికుల రఘురామ (తెలుగు): గౌతమ్ వర్మ, దీప్షిక తదితరులు నటించిన రొమాంటిక్ డ్రామా

లంబసింగి (తెలుగు): జై భారత్, దివి తదితరులు నటించిన విలేజ్ ప్రేమకథ

ఇవి కాకుండా.. మాయ, ఫ్యాక్షన్ లేని సీమ కథ వంటి చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

ఈవారం ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌ల వివరాలు

ఈవారం విడుదలవుతుంది అనుకున్న 'హనుమాన్' సినిమా ఎట్టకేలకు ఓటీటీలో రిలీజ్ కన్ఫర్మ్ అయింది. కానీ హిందీ వెర్షన్ మాత్రమే రిలీజ్ అవుతుంది, తెలుగు వెర్షన్ రావడం లేదు. దీంతో ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తుండటంతో దర్శకుడు ప్రశాంత్ వర్మ స్పందించారు. కావాలని ఆలస్యం చేయడం లేదని, వీలైనంత త్వరలోనే రిలీజ్ చేయడానికి కృషి చేస్తునట్లు తెలిపారు.

ఇదిలా ఉంటే ఈవారం నుంచి ఓటీటీలో సందడి చేసే కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌ల వివరాలు ఇలా ఉన్నాయి..

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:

*సేవ్ ది టైగర్స్ -2 (తెలుగు వెబ్ సిరీస్) – మార్చి 15

క్యారీ ఆన్ జట్టా 3 (పంజాబీ చిత్రం) - మార్చి 15

ZEE5:

మె అటల్ హూన్ (హిందీ చిత్రం) - మార్చి 14

జియో సినిమా:

*హనుమాన్ (హిందీ డబ్) – మార్చి 16

నెట్‌ఫ్లిక్స్

మర్డర్ ముబారక్ (హిందీ వెబ్ సిరీస్) – మార్చి 15

ఆహా:

మిక్స్-అప్ (తెలుగు సినిమా) – మార్చి 15

ప్రైమ్ వీడియో:

ఆటం (మలయాళ చిత్రం) - మార్చి 12

వడక్కుపట్టి రామసామి (తమిళ చిత్రం) – మార్చి 12

బిగ్ గర్ల్స్ డోంట్ క్రై (హిందీ వెబ్ సిరీస్) - మార్చి 14

సోనీ LIV:

భ్రమయుగం (మలయాళ చిత్రం) – మార్చి 15