బిగ్ బాస్ సీజన్ 7 లో మూడో రోజుకి సంబంధించి ప్రోమో విడుదలయింది. నిర్వాహకులు రిలీజ్ చేసిన ప్రోమోలో కాఫీ కోసం హీరో శివాజీ రచ్చ చేసినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ సీజన్ 7 లో మూడో రోజు రచ్చ రచ్చ జరిగినట్లు తాజా ప్రోమోలో కనిపిస్తోంది. నిర్వాహకులు రిలీజ్ చేసిన ప్రోమోలో కాఫీ కోసం హీరో శివాజీ రచ్చ చేసినట్లు తెలుస్తోంది.
బిగ్ బాస్ పై కేకలు వేస్తూ హంగామా చేయడంతో పాటు కోపంతో అరవడం వీడియోలో చూడొచ్చు. కాఫీ కోసం గోల చేస్తున్న శివాజీతో బిగ్ బాస్ హౌస్ లోకి బీపీ మిషన్ పంపించి శివాజీ బీపీ చెక్ చేయాలని మిగతా సభ్యులకు సూచించాడు. దీనిపై శివాజీ మండిపడ్డాడు. తాను ఓవైపు ఇబ్బంది పడుతుంటే జోకులేస్తావా? అంటూ బిగ్ బాస్ పై అరిచాడు.
తనకు హౌస్ లో ఉండడం ఇష్టంలేదని, కనీస అవసరాలు తీర్చని ఈ హౌస్ లో తాను ఉండనని స్పష్టం చేశాడు. తలుపు తీస్తే తాను బయటకు వెళ్లిపోతానని చెప్పాడు. మరి శివాజీ హౌస్ నుంచి వెళ్లిపోయాడా లేదా అనేది తెలుసుకోవాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.
Here's Video
The Bigg Boss house is on the edge as contestants face their toughest task yet. With emotions running, who will emerge victorious? Stay tuned for more updates.#BiggBossTelugu7 #Starmaa #DisneyPlusHotstar #Nagarjun pic.twitter.com/hlM6sQEmDI
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) September 7, 2023
బిగ్ బాస్ హౌస్ లోపల ఉన్న కంటెస్టెంట్లలో 14 మందిలో 8 మంది ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యారు. దామిని, శివాజీ, శోభా శెట్టి, గౌతమ్, కిరణ్ రాథోడ్, పల్లవి ప్రశాంత్, రతిక, షకీలాలలో ఒకరు ఈ వారంలోనే బయటకు రానున్నారు.