Vjy, Nov 13: ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద వైఎస్ జగన్ విమర్శలు కురిపించారు. కూటమి సర్కార్ మభ్యపెట్టే బడ్జెట్ ప్రవేశపెట్టిందని.. 8 నెలల పాటు బడ్జెట్ పెట్టకుండా ఎందుకు సాగదీశారంటూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌హన్‌రెడ్డి మండిపడ్డారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ, బడ్జెట్ పెడితే మోసాలు బయటపడతాయని బాబుకు తెలుసు.. అందుకే ఇంతకాలం బడ్జెట్ పెట్టకుండా సాగదీశారు. బడ్జెట్ పత్రాలే బాబు డ్రామా ఆర్టిస్ట్ అని తేల్చాయి. బడ్జెట్ చూస్తే బాబు ఆర్గ్‌నైజ్డ్ క్రైమ్ తెలుస్తుంది.’’ అంటూ విమర్శలు గుప్పించారు.
చంద్రబాబు ఒక అబద్ధాన్ని సృష్టిస్తాడు. ఆ అబద్ధాన్ని ఎల్లో మీడియాలో ప్రచారం చేయిస్తాడు. తర్వాత తన మనుషులతో పదేపదే అబద్ధాలు చెప్పిస్తాడు. అప్పుల విషయంలో ఏపీ శ్రీలంక అయిపోతుందని దుష్ప్రచారం చేశారు.ఇవే విషయాలను దత్త పుత్రుడితో మాట్లాడిస్తారు. ఇదంతా ఆర్గ్‌నైజ్డ్ క్రైమ్‌కు నిలువెత్తు ఆధారం’’ అని వైఎస్ జగన్ చెప్పారు. ఎన్నికల ముందు రాష్ట్ర అప్పులు రూ. 14 లక్షల కోట్లు అని దుష్ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చాక కూడా చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారు. చివరకు గవర్నర్‌తో కూడా అబద్ధాలు చెప్పించారు. సూపర్ సిక్స్ హమీలను ఎగ్గొట్టేందుకు బాబు దుష్ప్రచారం చేశారు. 2018-19 నాటికి రూ.3 లక్షల 13 వేల కోట్ల అప్పు.
YS jagan Press Meet on Budget
మా ప్రభుత్వం దిగిపోయే నాటికి 6 లక్షల 46 వేల కోట్లు అప్పు. రూ.14 లక్షల కోట్లు అప్పు చేశామని దుష్ప్రచారం చేశారు. చంద్రబాబు హయాంలో 19 శాతం అప్పులు పెరిగితే.. మా హయాంలో 15 శాతం అప్పులు పెరిగాయి. ఎవరి పాలనలో రాష్ట్రం శ్రీలంక అయిపోయిందో చెప్పాలి. అప్పు రత్న బిరుదు ఎవరికివ్వాలి?. ఆర్థిక క్రమశిక్షణ పాటించింది ఎవరు?. అప్పుల పెంపు వార్షిక సగటు చంద్రబాబు హయాంలో కన్నా మా హయాంలో తక్కువ’’ అని వైఎస్ జగన్ వివరించారు.