astrology

సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 6 వరకు చంద్రుడు రెండుసార్లు రాశి మార్చుకుంటాడు. సెప్టెంబర్ 26న ఉదయం 6 గంటలకు వృషభ రాశిలోకి ,అదే విధంగా అక్టోబర్ 6న మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. రెండుసార్లు రాశి మార్పు కారణంగా చంద్రుని అనుగ్రహం ఈ మూడు రాశులు వారి పైన అనుకూలంగా ఉంటుంది. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కన్యా రాశి- కన్య రాశి వారికి చంద్రుడు అధిపతిగా ఉంటాడు. ఈ రాశి మార్పు కారణంగా చంద్ర ప్రభావం అనుకూలంగా ఈ రాశి వారికి ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం వల్ల విలాసాలు పొందుతారు. సంపద కూడా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. దీని ద్వారా అప్పులు తీరుతాయి. దీని వల్ల మన సంతోషంగా ఉంటుంది. మీరు పని చేసే ప్రతి పనిని కూడా సకాలంలో పూర్తి చేస్తారు, విద్యార్థులు విదేశీ పర్యటనలు చేస్తారు. నూతన గృహాన్ని కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

వృశ్చిక రాశి-  చంద్రుడు రాశి మార్పు కారణంగా ఈ రాశి వారికి విశేష ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా చంద్రుని ఆశీస్సులు వీరికి ఉంటాయి. వ్యాపారవేత్తలను ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. వివాహం కాని వారికి వివాహాలు అవుతాయి. ఉద్యోగస్తులకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. దీంతో ఆదాయం కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చేసిన అప్పుల నుండి బయటపడతారు. ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్య నుండి బయటపడతారు. దూర ప్రయాణాలకు విహారయాత్ర వెళతారు.

Vastu Tips: వాస్తు ప్రకారం ఇంట్లో డబ్బులను ఎక్కడ దాచుకోవాలి, 

మీన రాశి- ఈ రాశి వారికి చంద్రుని భాష మార్పు కారణంగా అన్ని శుభ ఫలితాలు లభిస్తాయి. వ్యాపారస్తులకు మానసిక ఆందోళన నుండి బయటపడతారు. జీవిత భాగస్వామితో శుభకార్యాలలో పాల్గొంటారు. విహారయాత్రకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ఆనందం వాతావరణం ఉంటుంది. పెండింగ్లో ఉన్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. కోర్టు సమస్యల నుండి బయటపడతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తినేతలు అవుతారు. దీని ద్వారా వారు కోరుకున్న విద్య కోసం విదేశాలకు వెళతారు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.