న్యూఢిల్లీ, డిసెంబర్ 11: ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలనే కేంద్ర ప్రభుత్వ యోచనకు నిరసనగా బ్యాంక్ ఉద్యోగ సంఘాలు రెండు రోజుల సమ్మెకు (Banks strike) సిద్ధమయ్యాయి. డిసెంబర్ 16, 17 తేదీల్లో దేశ వ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు సమ్మెలో (Banks strike) పాల్గొంటారని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ప్రకటించింది. ఈ ప్రకటన నేపథ్యంలో రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెలో (Banks strike) భాగంగా డిసెంబర్ 16, 17 తేదీల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలలోని సేవలు ప్రభావితం కావచ్చని బ్యాంక్ అధికారులు ప్రకటించారు. బ్యాంకుల ప్రైవేటీకరణకు నిరసనగా ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు ఈ నెలలో రెండు రోజుల సమ్మె చేయనున్నారు. బ్యాంకుల ప్రైవేటీకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న బిల్లుకు నిరసనగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె (Banks strike) చేస్తున్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టిన బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు, 2021కి వ్యతిరేకంగా డిసెంబర్ 16 మరియు 17 తేదీల్లో సమ్మె చేయనున్నట్టు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ప్రకటించింది.
భర్త మరో మహిళతో.. చూసి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న భార్య, తెలంగాణ జనగామ జిల్లాలో విషాద ఘటన
ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (AIBOC) జనరల్ సెక్రటరీ సంజయ్ దాస్ మాట్లాడుతూ, ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ ఆర్థిక వ్యవస్థకు హాని కలిగిస్తుందని, స్వయం సహాయక బృందాలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు రుణ ప్రవాహాన్ని కూడా ప్రభావితం చేస్తుందని అన్నారు. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం మాట్లాడుతూ.. ‘‘గత 25 ఏళ్లుగా యూఎఫ్‌బీయూ బ్యానర్ కింద ప్రభుత్వ రంగ బ్యాంకులకు నష్టం కలిగించే బ్యాంకింగ్ రంగంలో ఇలాంటి సంస్కరణలను వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వ రంగ బ్యాంకులను బలహీనపరిచే లక్ష్యంతో తీసుకువచ్చిన బ్యాంకింగ్ సంస్కరణల విధానాలను తాము వ్యతిరేకిస్తున్నామని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA) ప్రధాన కార్యదర్శి సిహెచ్ వెంకటాచలం ప్రకటించారు.
ఈ రెండు రోజుల ధర్నాలో ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (AIBOC), నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ (NCBE), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (AIBOA), బ్యాంక్ ఎంప్లాయీస్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (BEFI), ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (INBEF), ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్ (INBOC), నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ (NOBW), నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ ఆఫీసర్స్ (NOBO) సంఘాలు పాల్గొననున్నాయి.