New Delhi, April 17: ఢిల్లీలోని జహంగీర్‌పురి ప్రాంతంలో (Jahagirpuri) హనుమాన్ జయంతి ర్యాలీ (Hanuman Jayanti Procession) హింసాత్మకంగా మారింది. కొందరు దుండగులు ర్యాలీపై రాళ్లు రువ్వడంతో హింస చేలరేగింది. ఇరువర్గాల ఒకరిపై ఒకరు రాళ్ల దాడి చేసుకోవటంతో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. దుండగులు వాహనాలకు నిప్పుపెట్టారు. పోలీసులు ఇరువర్గాలను కట్టడిచేసి శాంతియుత వాతావరణం నెలకొనేలా చర్యలు చేపట్టారు. జహంగీర్ పురి (Jahangirpuri ) ప్రాంతంలో మరోసారి అల్లర్లు చెలరేగకుండా పటిష్ఠ భద్రత చేపట్టారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా ఒక్కసారిగా కలకలం రేపింది. అయితే ఈ ఘటనకు పాల్పడిన వారిని గుర్తించే పనిలో పోలీసులు (Police) నిమగ్నమయ్యారు. ఆదివారం మధ్యాహ్నం వరకు 14మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Heavy security deployment in Delhi's Jahangirpuri area where a clash broke out yesterday during a religious procession pic.twitter.com/TFkApvrNj3
— ANI (@ANI) April 17, 2022
శనివారం సాయంత్రం 5.40 గంటలకు హనుమాన్ జయంతి ఊరేగింపులో హింస చెలరేగింది. ఢిల్లీలోని జహంగీర్ పురి (Jahagiripuri) ప్రాంతంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో హనుమాన్ శోభాయాత్రపై (Hanuman Jayanti Procession) దుండగులు రాళ్లు రువ్వారు. జహంగీర్ పురి ప్రాంతంలో పలు వాహనాలను దుండగులు ధ్వంసం చేశారు. వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ ఘర్షణ సమయంలో ఓ పోలీస్ కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. గాయపడ్డ కానిస్టేబుల్ ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
ఘటనను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ (Kejriwal) తీవ్రంగా ఖండించారు. పరిస్థితిని సమీక్షించారు. ఘర్షణ ప్రాంతంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మరోవైపు హింసాకాండ ఘటనపై కేంద్ర హోంశాఖ సమీక్ష నిర్వహించింది. వెంటనే ఘటనా స్థలానికి అదనపు బలగాలు మోహరించి ఘర్షణలు మరోసారి చోటుచేసుకోకుండా చర్యలు తీసుకున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amith shah) ఘటనపై ఆరా తీసి నిందితులను వెంటనే గుర్తించాలని పోలీస్ శాఖకు సూచించారు. రాళ్లదాడి ఘటనను ఉగ్రదాడిగా బీజేపీ నేత కపిల్ మిశ్రా (Kapil Misra) అభివర్ణించారు.
ఇదిలాఉంటే హింసాత్మక ఘటనపై దర్యాప్తు చేసేందుకు 10 బృందాలను ఏర్పాటు చేశారు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, క్రైం బ్రాంచ్ ఈ మొత్తం కేసును విచారించనుంది. అయితే ఈ విచారణలో భాగంగా రాళ్లదాడి, హింసాత్మక ఘటనలకు సంబంధించి 14 మందిని పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో (Social Media) ఉన్న సీసీటీవీ ఫుటేజీలు (CCTV), వీడియోలను ఉపయోగించి మరింత మంది అనుమానితులను గుర్తించామని, వారిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పోలీసు వర్గాలు తెలిపాయి. అల్లర్లు, హత్యాయత్నం, ఆయుధ చట్టం సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.