Jaipur, October 13: దేశాన్ని ఇప్పుడు భూకంపాలు వణికించేందుకు రెడీ అయ్యాయి. తాజాగా రాజస్థాన్‌లోని బికనీర్‌లో ఈ ఉదయం 10.36 గంటలకు భూకంపం సంభవించింది. అయితే ఈ భూకంపంలో ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లలేదని వాతావరణశాఖ విభాగం తెలిపింది. గడిచిన సోమవారం భూటాన్‌లో సంభవించిన భూకంపానికి అసోం ప్రభావితమైన విషయం తెలిసిందే. అదేవిధంగా గతవారం మణిపూర్‌లోని ఇంపాల్ జిల్లాలో సంభవించిన భూకంప తీవ్రత ఈశాన్య ప్రాంతాన్ని ప్రభావితం చేసింది. అరుణాచల ప్రదేశ్, అసోంలో సంభవించిన భూ ప్రకంపనల ధాటికి ప్రజలు భయంతో పరుగులు తీసారు.అర్థరాత్రి 1.45 గంటల ప్రాంతంలో సంభవించిన భూకంపం ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసింది. కాగా అరుణాచల ప్రదేశ్ రాజధాని ఇటా నగర్ కు 180 కిలోమీట్లర దూరంలో 40 కిలోమీటర్ల లేతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ విషయాన్ని ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఎఎన్ఐ రిపోర్ట్ చేసింది.
ఎఎన్ఐ రిపోర్ట్
An earthquake with a magnitude of 4.0 on the Richter scale hit Sikar, Rajasthan today at 5.11 am.
— ANI (@ANI) March 17, 2019
ఇదిలా ఉంటే జపాన్ లో భూమి మరోసారి కంపించింది. రిక్టార్ స్కేలుపై భూకంప తీవ్రత 5.7గా నమోదు అయినట్టు జపాన్ మెట్రోలాజికల్ ఏజెన్సీ తెలిపింది.ఈ భూకంపం ధాటికి జపాన్ అతలాకుతలమైంది. తుఫాను విరుచుకుపడడానికి ముందు సముద్రంలో భూకంపం సంభవించిందని, చిబా తీరానికి దగ్గర్లో సముద్రంలో 59.5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించామని అధికారులు చెప్పారు. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైందని తెలిపారు.చిబా సిటీలో గాలి తుఫాను విధ్వంసం సృష్టించింది. పెను గాలులకు రోడ్డు మీద వెళుతున్న కారు తలకిందులైంది. అందులో ప్రయాణిస్తున్న వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. తుఫాను ప్రభావంతో జరిగిన తొలి మరణం ఇదేనని అధికారులు చెప్పారు. టోర్నడో ఓ ఇంటిని చుట్టుముట్టడంతో అందులోని ఐదుగురు గాయపడ్డారు. తుఫాను కారణంగా మొత్తం 19 నగరాల్లో ఒకరు చనిపోగా, 51 మంది గాయపడ్డారు, మరో నలుగురు గల్లంతయ్యారని అధికారులు వెల్లడించారు.