Newdelhi, Aug 20: వరుస భూకంపాలతో (Earthquakes) మంగళవారం ఉదయం కశ్మీర్ (Kashmir) కంపించిపోయింది. రెండు వరుస భూకంపలతో ప్రజలు భయభ్రాంతులకు గురై ఇళ్ల నుంచి బయటకు వచ్చి రోడ్లపైకి చేరారు. అయితే, ఈ ఘటనలో ప్రాణ నష్టం కానీ, ఆస్తినష్టం కానీ సంభవించినట్టు ఇప్పటి వరకు ఎలాంటి వార్తలు రాలేదు. మొదట వచ్చిన భూకంపం బారాముల్లా జిల్లాలో భూమికి 5 కిలోమీటర్ల లోతున, రెండోది అదే ప్రాంతంలో 10 కిలోమీటర్ల లోతున ఉన్నట్టు అధికారులు తెలిపారు.
భారీ వర్షాల నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటన.. తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు
Two back-to-back #earthquakes with magnitudes 4.9 and 4.8 jolted #Jammu and #Kashmir's #Baramulla district
More details here: https://t.co/F05otz8Xif pic.twitter.com/VX3yEJAb6N
— Hindustan Times (@htTweets) August 20, 2024
7 నిమిషాల వ్యవధిలో
తొలుత ఉదయం 6.45 గంటల సమయంలో 4.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. మరో 7 నిమిషాల వ్యవధిలోనే అంటే సరిగ్గా 6.52 గంటలకు 4.8 తీవ్రతతో మరో భూంకంపం సంభవించింది. దీంతో ప్రజలు భయాందోళనలు చెందారు.