CAT 2023 Exam Result. (Photo credits: iimcat.ac.in)

దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐఎం (IIM)లలో ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌(CAT) 2023 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. నవంబర్‌ 26న జరిగిన ఈ పరీక్షకు దేశ వ్యాప్తంగా 375 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 2.88లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరు కాగా.. మొత్తంగా 14 మంది 100 పర్సంటైల్‌తో మెరిశారు. ఇందులో తెలంగాణ నుంచి ఇద్దరు, ఏపీ నుంచి ఒకరు ఉన్నట్లు ఐఐఎం లక్నో వెల్లడించింది. ఫలితాల కోసం లింక్ ఇదిగో..

డిసెంబర్‌ 5న ప్రాథమిక కీ విడుదల చేసిన అధికారులు ఈనెల 8వరకు అభ్యంతరాలు స్వీకరించారు. తాజాగా ఐఐఎం లక్నో (IIM Lucknow) క్యాట్‌ పరీక్ష తుది కీ, ఫలితాలు వెల్లడించింది. వచ్చే ఏడాది జనవరిలో ఐఐఎంలు పర్సనల్‌ ఇంటర్వ్యూలకు అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేయనున్నాయి. అదే సమయంలో ఇతర ఎంబీఏ కాలేజీలు సైతం అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టనున్నాయి.

గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలు.. జనవరి 6 వరకు దరఖాస్తులు.. ఫిబ్రవరి 11న ప్రవేశ పరీక్ష

దేశ వ్యాప్తంగా వున్న 21 ఐఐఎంలు, ప్రఖ్యాత బిజినెస్‌ స్కూల్స్‌లో ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు క్యాట్‌లో మంచి స్కోరు సాధించడం తప్పనిసరి. ఈ స్కోరు ఆధారంగా సీట్ల కేటాయింపులు జరుపుతారు. దేశంలో 91 నాన్‌ ఐఐఎం విద్యా సంస్థలు సైతం ఈ స్కోరును పరిగణనలోకి ప్రవేశాలు కల్పించనున్నాయి.