CBSE Class XII Result 2021: సిబిఎస్‌ఇ 12వ తరగతి 2021 ఫలితాలు విడుదల, మొత్తం 99.37% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించిన బోర్డ్, ఫలితాల కోసం లింక్స్ ఇవ్వబడ్డాయి, చూడండి
Representational Image (Photo Credits: PTI)

New Delhi, July 30:  CBSE 12వ తరగతి 2021 ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఈరోజు ప్రకటించింది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి విద్యార్థులు ఫలితాల కోసం బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ http://cbseresults.nic.in ను వీక్షించవచ్చు మరియు http://digilocker.gov.in, డిజిలాకర్ యాప్‌లో ఫలితాలను చూసుకునే వీలుంది.

COVID-19 యొక్క రెండవ వేవ్ కారణంగా ఈ సంవత్సరం పరీక్షలను CBSE రద్దు చేసింది. పరీక్షలు లేకుండానే సిబిఎస్‌ఇ బోర్డ్ ఫలితాలను ప్రకటించడం ఇదే తొలిసారి. క్లాస్ 11 మరియు 10 ఫైనల్స్‌లో విద్యార్థులు సాధించిన మార్కులు మరియు వారి గత పనితీరు ఆధారంగా ఫలితాలు విడుదల చేయబడ్డాయి.

Check this tweet:

2021 ఏడాదికి గానూ సిబిఎస్‌ఇ 12వ తరగతి పరీక్షలకు సుమారు 14 లక్షల మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, అందులో 99.37 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు బోర్డ్ తెలిపింది.  అంతేకాకుండా ఈ సంవత్సరం రికార్డ్ స్థాయిలో 1,50,152 మంది విద్యార్థులు 90 శాతానికి పైగా సాధించారని వెల్లడించింది. అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ ఫలితాల ఆధారంగా ఈ ఫలితాలను నిర్ణయించడంతో ఈసారి మెరిట్ లిస్టును సీబీఎస్ఇ ప్రకటించలేదు.