Class 10 Exam 2020: దేశవ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు ఉండవు, తూర్పు ఢిల్లీ విద్యార్ధులకు మాత్రమే పదవ తరగతి పరీక్షలు, వెల్లడించిన హెచ్‌ఆర్‌డీ మంత్రిత్వ శాఖ
Representational Image (Photo Credits: PTI)

New Delhi, May 6: దేశంలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. విద్యా వ్యవస్థ మొత్తం అతలాకుతలం అయిపోయింది. పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. 10 వతరగతి పరీక్షలు కూడా దేశ వ్యాప్తంగా వాయిదా పడ్డాయి. ఈ నేపధ్యంలో పదవ తరగతి పరీక్షల నిర్వహణపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. తూర్పు ఢిల్లీ విద్యార్ధులకు మినహా దేశవ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు ఉండవని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (హెచ్‌ఆర్‌డీ) మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది.

ఇక తూర్పు ఢిల్లీ విద్యార్ధులకు పదవ తరగతి పరీక్షలు నిర్వహించేముందు ప్రిపరేషన్‌ కోసం పది రోజుల సమయం ఇస్తామని హెచ్‌ఆర్‌డీ మంత్రిత్వ శాఖ ట్వీట్‌ చేసింది. కాగా పదవ తరగతి పరీక్షలను సీబీఎస్‌ఈ ఇప్పటికే రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇక సీఏఏ అల్లర్లతో అట్టుడుకిన తూర్పు ఢిల్లీలో మాత్రం వాయిదా పడిన పదవ తరగతి పరీక్షలను నిర్వహించేందుకు అధికారులు కసరత్తు సాగిస్తున్నారు.

HRD Minister Tweet:

పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) మరియు కోవిడ్ -19 లాక్‌డౌన్‌పై హింస కారణంగా ఈశాన్య ఢీల్లీలోని విద్యార్థులు ఆరు సబ్జెక్టులకు పరీక్షలు వాయిదా పడ్డాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్ఇ) బోర్డ్ ఎగ్జామ్ తేదీని రాబోయే కొద్ది రోజుల్లో విడుదల చేస్తామని హెచ్ఆర్డి మంత్రి చెప్పారు. ఈ నేపథ్యంలో 12 వ తరగతి పరీక్షలు కూడా పెండింగ్‌లో ఉన్నాయి.