 
                                                                 Newdelhi, Sep 6: నిరుద్యోగం (Un Employment) విలయతాండవం చేస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల (Central Government Jobs) జాతరకు తెరలేపింది. పదో తరగతి విద్యార్హతతో 39 వేలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయింది. కేంద్ర సాయుధ బలగాల్లోని వివిధ విభాగాల్లో మొత్తం 39,481 కానిస్టేబుల్ (జీడీ) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర సాయుధ బలగాల (సీఆర్పీఎఫ్) తో పాటు ఎన్ఐఏ, ఎస్ఎస్ఎఫ్, అస్సాం రైఫిల్స్ (రైఫిల్ మ్యాన్) నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో విభాగాల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తారు.
Staff Selection Commission SSC Recruitment 2024
👉Post : GD Constable
👉Total : 39481 Post
👉Eligibility : 10th Pass
👉Last Date : 14/10/2024#SarkariResult #SSC
Click to Know More & Apply : https://t.co/he7C61wAkW pic.twitter.com/XvuOBFJnLB
— Sarkari Result - SarkariResult.Com (@sarkari_result) September 5, 2024
పరీక్ష ఇలా..
జనవరి లేదా ఫిబ్రవరిలో ఆన్ లైన్ పరీక్ష జరిగే అవకాశం ఉన్నట్లు ఎస్ఎస్‌సీ వెల్లడించింది. అర్హులైన అభ్యర్ధులు సెప్టెంబర్ 5 నుండి అక్టోబర్ 14 వరకు ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంగ్లిష్, హిందీ భాషల్లోనే కాకుండా, తెలుగు సహా మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు.
పూర్తి వివరాల కొరకు ఈ లింక్ ను క్లిక్ చేయండి.
https://ssc.gov.in/api/attachment/uploads/masterData/NoticeBoards/Notice_of_CTGD_2024_09_05.pdf
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
