
New Delhi, August 2: ఉద్యోగం కోసం చూసీ చూసీ అలసిపోయారా? ఇంటర్వ్యూలకు వెళ్తే పని అనుభవం (experience) అడుగుతున్నారా? అయితే ఈ వార్త మీకోసమే.. ఎలాంటి ఉద్యోగ అనుభవం లేకపోయినా ట్రైనింగ్ తో పాటు ఆకర్షణీయ వేతనంతో (good salary) ఉద్యోగావకాశాలను కల్పించడానికి టెక్ దిగ్గజం క్విక్ లాంచ్ (quicklaunch) దరఖాస్తులను కోరుతున్నది. దరఖాస్తు చేయడానికి నేడే (మంగళవారం 02.08.2022) ఆఖరు తేదీ. ఆలస్యం చేయకండి.
ఉద్యోగం.. ఇతరత్రా వివరాలు
పోస్టు పేరు: టెక్నికల్ సపోర్ట్ ఇంజినీర్
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత
అనుభవం: అవసరం లేదు
అవసరమైన నైపుణ్యాలు: ఎంఐఎస్ రిపోర్టింగ్, ఎమ్మెస్ ఆఫీస్, సీడబ్లూ టూల్ లో పరిజ్ఞానం. (ఇవి రాకపోతే, శిక్షణలో నేర్పిస్తారు)
వేతనం: అభ్యర్థి నైపుణ్యం బట్టి నెలకు రూ. 50 వేల వరకు
ఉద్యోగ బాధ్యతలు:
-సపోర్ట్ టీంలను సమన్వయం చేయాలి.
-క్లయింట్ కాల్స్ సెటప్ చేయాలి.
-టెక్ సపోర్ట్ స్పెషలిస్ట్ లకు టాస్క్ లు కేటాయించాలి
దరఖాస్తు, వేతనం కోసం https://quicklaunch.io/ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.