AP Education Minister Adimulapu Suresh (Photo-ANI)

Amaravati,June 8: ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రంలో కరోనా పరిస్థితులు చక్కబడ్డాకే పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలు (AP SSC& Inter Exams Update) నిర్వహిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. మంగళవారం ఆయన ( Education Minister Adimulapu Suresh) మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకునే పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నట్టు చెప్పారు. విద్యార్థుల భవిష్యత్‌ను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షం రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.

ఇతర రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేస్తున్నాయని.. అలాగని ఏపీలో కూడా పరీక్షలు రద్దు చేయాల్సిన అవసరం ఏముందన్నారు. అలాగైతే ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారా?అని మంత్రి ప్రశ్నించారు. రాష్ట్రంలో కరోనా ఉద్దృతి నేపథ్యంలో పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసిన విషయం తెలిసిందే. కాగా, ఏపీలో పదో తరగతి పరీక్షలపై జులైలో సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకోనున్నారు. వాస్తవానికి జూన్ 7 నుంచి పది పరీక్షలు జరగాల్సి ఉండగా, ఆ సమయంలో కరోనా ఉద్ధృతంగా వ్యాపిస్తుండడంతో వాయిదా వేశారు. ఇక ఇంటర్ పరీక్షలను ఆగస్టులో నిర్వహించే అవకాశాలున్నాయి. పరీక్షల తేదీకి 15 రోజుల ముందు ప్రకటన చేస్తామని మంత్రి ఆదిమూలపు ఇప్పటికే తెలిపారు.

వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌లో ఉద్యోగాలు : ఏపీ ప్రభుత్వ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగానికి చెందిన కృష్టా జిల్లాలోని డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌.. ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన మొత్తం 27 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో ఆరోగ్య మిత్ర 22 పోస్టులు; టీం లీడర్‌: 05 పోస్టులు ఉన్నాయి.

ఆరోగ్య మిత్ర పోస్టుకి అర్హత: మంచి అకడెమిక్‌ రికార్డుతో బీఎస్సీ నర్సింగ్, ఎమ్మెస్సీ నర్సింగ్, బీఫార్మసీ, ఫార్మ్‌ డి, బీఎస్సీ మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ ఉత్తీర్ణులై ఉండాలి. మంచి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌; ఇంగ్లిష్, తెలుగు చదవడం,రాయడంతోపాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి. వయసు 42ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.12,000 చెల్లిస్తారు.

టీం లీడర్‌ పోస్టుకి అర్హత: మంచి అకడెమిక్‌ రికార్డుతో బీఎస్సీ నర్సింగ్, ఎమ్మెస్సీ నర్సింగ్, బీఫార్మసీ, ఫార్మ్‌ డి, బీఎస్సీ మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవం ఉండాలి. మంచి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌; ఇంగ్లిష్, తెలుగు చదవడం, రాయడంతోపాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి. పీజీ, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌లో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. వయసు 42ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.15,000 చెల్లిస్తారు.

►​​​​​​​ ఎంపిక విధానం: అకడెమిక్‌ మెరిట్, కంప్యూటర్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

►​​​​​​​ దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

►​​​​​​​ చిరునామా: డిస్ట్రిక్‌ కోఆర్డినేటర్, డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఏహెచ్‌సీటీ, స్టేట్‌ గెస్ట్‌హౌస్‌ కాంపౌండ్, గోపాలరెడ్డి రోడ్, గవర్నర్‌పేట, విజయవాడ.

►​​​​​​​ దరఖాస్తులకు చివరి తేది: 09.06.2021

►​​​​​​​ వెబ్‌సైట్‌: https://krishna.ap.gov.inA