IPE Exams 2020. Representational Image. | Photo: PTI

Hyderabad, June 17: తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు (TS Inter Result 2020) తేదిని బోర్డు ప్రకటించింది. ఈ నెల 18న ఒకేసారి ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ పరీక్షల ఫలితాలను విడుదల చేయనున్నట్లు తెలంగాణ ఇంటర్‌ బోర్డు (Telangana State Board of Intermediate Education (TSBIE) వెల్లడించింది. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారులు ప్రకటించారు. ఇంటర్‌ పరీక్షా ఫలితాలకు సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయని, తుది నివేదికను విద్యాశాఖకు సమర్పించినట్లు ఇంటర్‌ బోర్డు సెక్రటరీ (TS intermediate board secretary) తెలిపారు. ఏపీ ఇంటర్ ఫలితాలు రేపు విడుదల, మనబడి అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఫలితాలను విడుదల చేయనున్న ఆంధ్రప్రదేశ్ బోర్డు

ఈ ఏడాది ఇంటర్‌ పరీక్షలకు మొత్తం 9.65 లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్‌ చేసుకోగా 95.72 శాతం మంది హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,339 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. మార్చి 4వ తేదీన ప్రారంభమైన ఇంటర్‌ పరీక్షలు.. ఆ నెల 23వ తేదీ వరకు కొనసాగిన విషయం విదితమే. మరోవైపు ఇంటర్మీడియట్‌ ఫలితాలు వెలువడిన వెంటనే విద్యార్థులకు ఫలితాల (విద్యార్థులు డౌన్‌లోడ్‌ చేసుకునే వెబ్‌ కాపీ)తోపాటు డిగ్రీ ప్రవేశాల గ్రీటింగ్‌ మెసేజ్‌ పంపిస్తామని డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి తెలిపారు. తెల్లవారే ప్రవేశాల నోటిఫికేషన్‌ జారీచేస్తామన్నారు.

ఫలితాలను విద్యార్థులు అధికారిక వెబ్ సైట్లు tsbie.cgg.gov.in, results.cgg.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు. అందులో ఎలా చెక్ చేసుకోవాలనే దానిపై కింది స్టెప్స్ ఫాలో కాగలరు

ముందుగా TSBIE అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in లోకి లాగిన్ కావాలి.

అక్కడ కనిపించే ఫలితాల అనే న్యూస్ మద క్లిక్ చేయాలి

Class 12 results అనే ఆప్సన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయాలి. రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత మాత్రమే చెక్ చేయాలి.

అక్కడ కనిపించే వివరాలను ఎంటర్ చేసి మీరు మీ ఫలితాలను పొందవచ్చు.

కాగా కోవిడ్ 19 వ్యాప్తి నేపథ్యంలో 10వ తరగతి పరీక్షలను రద్దు చేసిన సంగతి విదితమే. వారంతా నేరుగా పైతరగతులకు ప్రమోట్ అవుతారు.