గత నెలలో జరిగిన తెలంగాణ ఎంసెట్, ఈసెట్ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ సెట్‌లో 90.7 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఎసెంట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లో 80.41 శాతం, అగ్రికల్చర్ స్ట్రీమ్‌లో 88.34 శాతం ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి హైదరాబాద్ జేఎన్‌టీయూలో ఫలితాలను విడుదల చేశారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని పీజీ కోర్సుల సెమిస్టర్ పరీక్షలు వాయిదా
గత నెల 18 నుంచి 20వ తేదీ వరకు ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగం, 30, 31 తేదీల్లో అగ్రి, మెడికల్ ఎంసెట్ జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ విభాగానికి 1.52 లక్షలమంది, అగ్రి ఎంసెట్‌కు 80 వేలమంది హాజరయ్యారు. ఎంసెట్, ఈసెట్ ఫలితాల కోసం eamcet.tsche.ac.in వెబ్‌సైట్‌కు లాగిన్ అవ్వొచ్చు.