తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు 1 నుంచి నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఈ పరీక్షలు 10వ తేదీ వరకు కొనసాగుతాయని వెల్లడించారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు నిర్వహించనున్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులు జులై 18వ తేదీ లోపు సంబంధిత పాఠశాలల్లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇక తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో బాలికలు తమ సత్తాను చాటారు. 92.45 శాతం ఉత్తీర్ణత సాధించి బాలికలు విజయభేరి మోగించారు. బాలురు 87.61 శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రయివేటు విద్యార్థుల్లోనూ బాలికలదే పైచేయి. పదోతరగతి ఫలితాలు విడుదలయ్యాయి, విద్యార్థులు తమ ఫలితాలను bse.telangana.gov.in, bseresults.telangana.gov.in ద్వారా చెక్ చేసుకోండి
బాలికలు 58.76 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 46.21 శాతం పాసయ్యారు. 3,007 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. 15 పాఠశాలల్లో జీరో శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ పదిహేను స్కూల్లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు. రెగ్యులర్ విద్యార్థులు 5,03,579 మంది పరీక్షలకు హాజరు కాగా, 4,53,201 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా టెన్త్ ఫలితాల్లో 90 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక ప్రయివేటు విద్యార్థుల విషయానికి వస్తే 819 మంది హాజరు కాగా, 425 మంది పాసయ్యారు. 51.89 శాతం ఉత్తీర్ణత సాధించారు.
అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్ ఇదే..
ఆగస్టు 1 – ఫస్ట్ లాంగ్వేజ్
ఆగస్టు 2 – సెకండ్ లాంగ్వేజ్
ఆగస్టు 3 – థర్డ్ లాంగ్వేజ్(ఇంగ్లీష్)
ఆగస్టు 4 – మ్యాథమేటిక్స్
ఆగస్టు 5 – జనరల్ సైన్స్(ఫిజికల్ సైన్స్, బయాలజీ)
ఆగస్టు 6 – సోషల్ స్టడీస్
ఆగస్టు 8 – ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -1
ఆగస్టు 10 – ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -2