CM Jagan Konaseema Tour: సీఎం జగన్ సంచలన నిర్ణయం, నాలుగు ముంపు మండలాలతో రెవిన్యూ డివిజన్‌ ఏర్పాటు, పూర్తి పరిహారం ఇచ్చాకే పోలవరం ప్రాజెక్టు నింపుతామని తెలిపిన ఏపీ సీఎం
YS Jagan (Photo-Video Grab)

Amaravati, July 27: వరద ప్రాంతాల్లో బాధితుల పరామర్శలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండోరోజు పర్యటన (CM Jagan Konaseema Tour) కొనసాగుతోంది. బాధితులకు అందుతున్న సహాయక చర్యల గురించి నేరుగా వాళ్ల ద్వారానే అడిగి తెలుసుకుంటున్నారు నేడు అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. చింతూరు మండలంలో సీఎం జగన్‌ పర్యటన కొనసాగింది.వరదలతో నష్టపోయిన ఏ ఒక్కరికీ అన్యాయం జరగదని, ప్రతీ ఒక్కరికీ పరిహారం అంది తీరుతుందని సీఎం జగన్‌ ( CM Jagan) స్పష్టం చేశారు. కోయుగూరు గ్రామంలో నిర్వాసితులతో సీఎం జగన్‌ మాట్లాడారు.

పారదర్శకంగా బాధితులకు పరిహారం అందించాం. అందరికీ రేషన్‌, ఇంటింటికీ రూ. 2 వేలు అందించాం. అధికారులను భాగస్వామ్యం చేసి.. కావాల్సిన వనరులు సమకూర్చాం అని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అందరికీ సహయం, అన్ని సౌకర్యాలు అందాయని కోయుగూరు వరద బాధితులు తెలిపారు. పోలవరం నిర్వాసితుల పరిహారం విషయంలో కేంద్రంతో కుస్తీ పడుతూనే ఉన్నామని, కేంద్రం చెల్లించకుంటే రాష్ట్రం తరపున సెప్టెంబర్‌లోగా పోలవరం నిర్వాసితులకు ఇవ్వాల్సిన పరిహారం చెల్లిస్తామని, ఆతర్వాతే ప్రాజెక్టులో నీళ్లు నింపుతామని సీఎం జగన్‌.. నిర్వాసితులకు భరోసా ఇచ్చారు.

సీఎం జగన్ జేబులో పెన్ను తీసుకున్న బాలుడు, వెంటనే తన పెన్‌ గిఫ్ట్‌గా ఇచ్చి ఆశీర్వ‌దించిన ఏపీ ముఖ్యమంత్రి, సోషల్ మీడియాలో వీడియో వైరల్

పోలవరం ముంపు బాధితులకు భరోసా ఇచ్చే క్రమంలో ఏపీ సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. నాలుగు ముంపు మండలాలతో రెవిన్యూ డివిజన్‌ ఏర్పాటు ఉంటుందని తెలిపారు. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీకి రూ.20 వేల కోట్లు అవసరం. ఆ ప్యాకేజీ కోసం కోసం కేంద్రంతో కుస్తీ పడుతున్నాం. వెయ్యి కోట్లో, రెండు వేల కోట్లో అయితే మేమే ఇచ్చేవాళ్లం. అంత కాబట్టే కేంద్రం సాయం చేయాల్సిందే. పోలవరం పునరావాసం అంతా కేంద్రం చేతుల్లోనే ఉంది. ఆ సాయం కోసం కేంద్రంతో యుద్ధం చేస్తున్నాం. సెప్టెంబర్‌లోగా పోలవరం నిర్వాసితులకు పరిహారం అందేలా చూస్తాం. పూర్తి పరిహారం ఇచ్చాకే పోలవరం ప్రాజెక్టు నింపుతాం. ఏ ఒక్కరికీ అన్యాయం జరగనీయం అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.