New delhi,October 27: ఇండియా బార్డర్ దీపాల వెలుగులతో విరజిమ్మింది. ఇండియన్ ఆర్మీ దివాళీ వేడుకలను ఘనంగా జరుపుకుంది. ప్రతి ఏడాది మాదిరిగానే ప్రధాని నరేంద్ర మోడీ ఈసారి కూడా సరిహద్దుల్లోని భద్రతా బలగాలతో కలిసి దీపావళి వేడుకలు చేసుకోనున్నారు. కాగా రెండ్రోజుల క్రితమే ప్రధాని వీర జవాన్లందరికీ దీపావళి శుక్షాకాంక్షలు తెలిపారు.2014లో తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ ఆ ఏడాది దీపావళిని సియాచిన్ వద్ద ఆర్మీ జవాన్లతో జరుపుకొన్నారు.
ఆ తర్వాత ఏడాది పంజాబ్ సరిహద్దుల్లో పర్యటించి జవాన్లతో కలిసి వేడుకలో పాల్గొన్నారు. 2016లో హిమాచల్ ప్రదేశ్ వెళ్లి ఇండో-టిబిటెన్ సరిహద్దు పోలీసులతో కలిసి దీపావళి సంబరాలు జరుపుకొన్నారు. నాలుగో దీపావళిని 2017లో జమ్మూకశ్మీర్‌లోని గురెజ్ లో సరిహద్దు జవాన్లతో కలిసి చేసుకున్నారు.
ఆర్మీ దివాళీ వేడుకలు
Jammu and Kashmir: Border Security Force (BSF) personnel light earthen lamps on the eve of Diwali in Samba. #Diwali pic.twitter.com/CyVvVxtmxQ
— ANI (@ANI) October 26, 2019
గతేడాది ఉత్తరాఖండ్‌లోని భారత్-చైనా సరిహద్దులో ఆర్మీ, ఐటీబీపీ సిబ్బందితో ప్రధాని దీపావళి జరుపుకున్నారు. ప్రధాని మోడీ ఈసారి కూడా భద్రతా బలగాలతో కలిసి దీపావళి వేడుకులు జరుపుకోనున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
పెద్ద బ్యానర్ ప్రదర్శించిన ఇండియన్ ఆర్మీ
Ceremonial meet held between Indian, Chinese armies on Diwali in eastern Ladakh
Read @ANI Story | https://t.co/BkBT3xzXsL pic.twitter.com/QBREgJBkjI
— ANI Digital (@ani_digital) October 26, 2019
కాగా దీపావళి సందర్భంగా బార్డర్ లో భారత ఆర్మీకి చైనా ఆర్మీ అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. ఈస్ట్రన్ లఢక్ లోని సరిహద్దు పోస్టు వద్ద ఇరు దేశాల ఆర్మీ అధికారులు కలిసి దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నారు.
శుభాకాంక్షలు తెలిపిన చైనా ఆర్మీ
Ceremonial Border Personnel Meeting (BPM) held between the Indian Army and Chinese PLA today on the occasion of #Diwali at the Indian BPM Huts at Chushul– Moldo and DBO-TWD meeting points of Eastern Ladakh. pic.twitter.com/qevEldI8st
— ANI (@ANI) October 26, 2019
ఇందులో భాగంగా భారత ప్రజలకు దీపావళీ శుభాకాంక్షలు తెలుపుతూ.. పెద్ద ఎత్తైన బ్యానర్ ను ప్రదర్శించారు చైనా మిలటరీ అధికారులు. ఇరు దేశాల మధ్య మరింత సామరస్య వాతావరణం ఏర్పడాలని పలువురు కోరారు. ఈ విషయంపై నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
బార్డర్లో దివాళీ వెలుగులు
Jammu and Kashmir: Border Security Force personnel of 72nd Battalion at Poonch hold celebrations on the eve of #Diwali. pic.twitter.com/vAguZDDgaP
— ANI (@ANI) October 26, 2019
భారత ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తమిళనాడులో స్నేహపూర్వకంగా కలిసిన మీటింగ్ ఇరు దేశాలకు కలిసివచ్చిందని రెండు దేశాలు కలిసి మరింత అభివృద్ధి చెందాలని విష్ చేశారు.