Kolkata, December 19: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్- 2020 (Indian Premier League- 2020) ఆటగాళ్ల వేలం డిసెంబర్ 19న గురువారం తొలిసారిగా కోల్‌కతాలో ప్రారంభమైంది. సీజన్ -13 కోసం మొత్తం 332 మంది క్రికెటర్లు వేలానికి అందుబాటులో ఉన్నారు. వీరిలో 186 మంది దీశీయ ఆటగాళ్లు కాగా, విదేశీ ఆటగాళ్ల సంఖ్య 143 గా ఉంది. అసోసియేట్ నేషన్స్‌కు చెందిన ముగ్గురు ఆటగాళ్లు కూడా ఉన్నారు.
మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీలు వారికి నిర్ధేషించిన బడ్జెట్ మరియు అందుబాటులో ఉన్న స్లాట్ల ప్రకారం ఆటగాళ్లను వేలం (IPL 2020 Auction)లో కొనుక్కోవాల్సి ఉంటుంది. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ అత్యధికంగా 12 స్లాట్లను కలిగి ఉండగా, దిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మరియు కోల్‌కతా నైట్ రైడర్స్ గరిష్టంగా (11) స్లాట్‌లను కలిగి ఉన్నాయి. ఈ మూడు ఫ్రాంచైజీలు తమ పర్సులో మిగిలి ఉన్న ఉన్న రూ. 27 కోట్ల లోపు ఆటగాళ్లను దక్కించుకోవాల్సి ఉంటుంది.
ఆస్ట్రేలియా డాషింగ్ ఒపెనర్ క్రిస్ లిన్ (Chris Lynn) ఐపీఎల్ 2020 వేలంలో అమ్ముడుపోయిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఇతణ్ని ముంబై ఇండియన్స్ (Mumbai Indians) అతడి కనీస ధర రూ. 2 కోట్లకు దక్కించుకొంది.
ఇంగ్లండ్ జట్టును ప్రపంచ కప్ విజేతగా నిలిపిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ను రూ. 5.25 కోట్ల రూపాయలు పోసి సొంతం చేసుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్
కీలక సమయాల్లో బాగా రాణించి కోల్‌కతా నైట్ రైడర్స్ విజయాల్లో ముఖ్య పాత్ర పోషించిన రాబిన్ ఉతప్పను రాజస్థాన్ రాయల్స్ రూ. 3 కోట్లకు దక్కించుకుంది.
ఇక భారత ఆటగాళ్లు చేతేశ్వర్ పూజారా మరియు హనుమ విహారిలకు తొలి రౌండ్‌లో మొండిచేయి ఎదురైంది. వారి కనీస ధర రూ. 50 లక్షలకు కూడా కొనుగోలు చేసేందుకు ఏ ప్రాంచైజీ ఆసక్తి చూపలేదు. * CATCH LIVE UPDATES HERE - మరిన్ని లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేసి అప్‌డేట్స్ పొందండి
సౌత్ ఆఫ్రికా ఆల్- రౌండర్ క్రిస్ మోరిస్ ను అత్యధికంగా రూ. 10 కోట్లకు పెట్టి దక్కించుకున్న బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్.
వేలంలో దుమ్మురేపిన ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ పాట్ కమ్మిన్స్ , రూ. 15.50 కోట్ల పోసి పాట్ కమ్మిన్స్ ను కొనుగోలు చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్.