
Newdelhi, Nov 20: మహారాష్ట్రలో (Maharastra) భూకంపం (Earthquake) సంభవించింది. సోమవారం తెల్లవారుజామున రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రత గల భూకంపం నమోదయ్యింది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. సోమవారం ఉదయం 5.09 గంటల సమయంలో సంభవించిందని, భూఉపరితలం నుంచి 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని తెలిపింది.
3.5 Magnitude Earthquake Hits Maharashtra's Hingoli https://t.co/OA0XWiuATl pic.twitter.com/GKnRPCZAI0
— NDTV News feed (@ndtvfeed) November 20, 2023
తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా
తెలంగాణ (Telangana), కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ప్రకంపనలు నమోదయ్యాయి. భూకంప కేంద్రం హింగోలి జిల్లా తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు 255 కిలోమీటర్లు, నాగ్ పూర్ కు 265 కిలోమీటర్ల దూరంలో ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కాగా ఈ భూకంపం ప్రభావంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం నమోదుకాలేదు.