Newdelhi, July 29: అండమాన్ నికోబార్ దీవులను (Andaman and Nicobar) మరోసారి భూకంపం (Earthquake) వణికించింది. పోర్ట్ బ్లెయిర్ కు సమీపంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.9గా నమోదయింది. భూకంప కేంద్రం పోర్ట్ బ్లెయిర్ కు ఆగ్నేయ దిశలో 126 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమయిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. భూ ఉపరితలానికి 69 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉందని తెలిపింది.
5.9 Magnitude #Earthquake Hits Andaman And Nicobar Islands pic.twitter.com/kPCeTduWup
— Jeyaram Anojan (@AnojanJeyaram) July 29, 2023
ఉలిక్కిపడ్డ ప్రజలు
అర్ధరాత్రి 12.53 గంటలకు భూకంపం సంభవించింది. భూప్రకంపనలతో గాఢ నిద్రలో ఉన్న ప్రజలు ఉలిక్కి పడ్డారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. అయితే భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.