Air India Express flight (Photo-ANI)

పదవ తరగతి చదివిన నిరుద్యోగులకు ఎయిర్ ఇండియా శుభవార్త చెప్పింది. ఎయిర్‌ ఇండియా ఎయిర్‌పోర్ట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌(ఏఐఏఎస్‌ఎల్‌) చెన్నై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడించింది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు ఎస్‌ఎస్‌ఎల్‌సీ/ 10వ తరగతి ఉత్తీర్ణత, ఏదైనా గ్రాడ్యుయేషన్, ఐటీఐ, మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి.

భారీ వేతనంతో యూపీఎస్సీలో ఉద్యోగాలు, మొత్తం 146 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల, విద్యార్హతలు, పే స్కేల్, ఇతర వివరాలు తెలుసుకోండి

చెన్నై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమర్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌, ఆర్‌ఎస్‌ఏ/ యూఏఆర్‌డీ, హ్యాండిమ్యాన్ త‌దిత‌ర పోస్టుల భ‌ర్తీకి ఇంటర్వ్యూల కోసం న్యూఢిల్లీ కేంద్రంగా ఉన్న ఎయిర్‌ ఇండియా ఎయిర్‌పోర్ట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్ (ఏఐఏఎస్‌ఎల్‌) ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

ఏఐఏఎస్‌ఎల్‌ ఉద్యోగాల వివరాలు

మొత్తం పోస్టులు : 495

పోస్టులు : కస్టమర్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌, ఆర్‌ఎస్‌ఏ/ యూఏఆర్‌డీ, హ్యాండిమ్యాన్ త‌దిత‌రాలు

అర్హతలు : పోస్టులను బ‌ట్టి 10వ తరగతి, ఏదైనా గ్రాడ్యుయేషన్‌, డిప్లొమాలో ఉత్తీర్ణత

వయసు: 28 ఏళ్లు మించకూడదు

జీతం: నెలకు రూ.23640

ఎంపిక : వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ, ట్రేడ్‌ టెస్ట్‌, ఫిజికల్‌ ఎండ్యురెన్స్‌ టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది.

వేదిక : HRD డిపార్ట్‌మెంట్ కార్యాలయం, AI యూనిటీ కాంప్లెక్స్, పల్లవరం కంటోన్మెంట్, చెన్నై -600043

ఇంటర్వ్యూ తేది: ఏప్రిల్ 17 నుంచి 20 వ‌ర‌కు

ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు.

వెబ్‌సైట్ : www.aiasl.in