UIDAI Extends Free Online Aadhaar Update (Credits: X)

Newdelhi, Sep 14: పుష్కరకాలం క్రితం నాటి ఆధార్‌ కార్డుల్లోని (Aadhaar Card) వివరాలను ఉచితంగా అప్‌ డేట్‌ (Free Update) చేసుకోవడానికి శనివారం ఆఖరు తేదీ కావడంతో ఈ గడువును మరోసారి పొడిగిస్తున్నట్టు ఉడాయ్‌ ప్రకటించింది. సెప్టెంబర్‌ 14 తేదీ స్థానంలో డిసెంబర్ 14 ను గడువుగా పేర్కొంది. డిసెంబర్ 14 తర్వాత మార్పులు చేసుకోవాలంటే రూ.50 జరిమానా చెల్లించాలని తెలిపింది. వేలిముద్రలు, ఐరిస్‌ స్కాన్స్‌, ముఖ చిత్రాల వంటి బయో మెట్రిక్‌ సమాచారాన్ని ఆన్‌ లైన్‌ లో అప్‌ డేట్‌ చేసుకోలేరని తెలిపింది.

17న గణేశ్ నిమ‌జ్జ‌నం.. ఈ జిల్లాల్లోని స్కూల్స్, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెల‌వు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. అలా చూస్తే, మొత్తంగా నాలుగు రోజులు హాలీడే..

ఉచిత అప్ డేట్ ఇలా..

ఉచిత అప్ డేట్ కోసం వ్యక్తిగత గుర్తింపు, చిరునామా పత్రాలను అప్‌ లోడ్‌ చేయాలని ఉడాయ్‌ తెలిపింది. ఉడాయ్‌ అధికార వెబ్‌ సైట్‌ http://myaadhar.uidai.gov.inలో ఆధార్‌ నంబర్‌, మొబైల్‌ నంబర్‌ సాయంతో లాగిన్‌ అయి వివరాలను అప్‌ డేట్‌ చేసుకోవచ్చని వివరించింది.

హైదరాబాద్ లో వెల్లివిరిసిన మతసామరస్యం.. కేపీహెచ్‌బీలో వినాయకుడి నిమజ్జనంలో కలిసి డాన్సు స్టెప్స్ వేసిన హిందూ-ముస్లిం సోదరులు.. వీడియో వైరల్