Image used for representational purpose.| Photo: Wikimedia Commons

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్  SBI,  5008 జూనియర్ అసోసియేట్స్ పోస్టులను భర్తీ చేయనుంది. హైదరాబాద్ సర్కిల్ లో 225 పోస్టులున్నాయి. అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య 5008

సర్కిల్ వారీగా ఖాళీలు:

అహ్మదాబాద్ - 357

బెంగళూరు - 316

భోపాల్ - 481

బెంగాల్ - 376

భువనేశ్వర్ - 170

చండీగఢ్ - 225

చెన్నై - 362

ఢిల్లీ - 152

హైదరాబాద్ - 225

జైపూర్ - 284

కేరళ- 273

లఖ్ నవూ/ఢిల్లీ - 631

మహారాష్ట్ర/ముంబై మెట్రో - 747

మహారాష్ట్ర - 50

నార్త్ ఈస్టర్న్ - 359.

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్ / తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి.

(డిగ్రీ ఫైనల్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు)

వయసు: 1.08.2022 నాటికి 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

(2.08.1994 - 1.08.2002 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు సడలింపు ఉంటుంది)

ఎంపిక : ఆన్ లైన్ టెస్ట్ (ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్), స్థానిక భాష పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.

పరీక్షా విధానం:

ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్ష ఇలా రెండు దశల్లో నిర్వహిస్తారు.

ప్రిలిమినరీ: పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో 100 మార్కులకు నిర్వహిస్తారు.

ప్రిలిమినరీలో మూడు విభాగాలుంటాయి.

1. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు 30 మార్కులకు ఉంటుంది.

2. న్యూమరికల్ ఎబిలిటీ 35 ప్రశ్నలు 35 మార్కులు

3. రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలు 35 మార్కులు

పరీక్షా సమయం 1 గంట. నెగిటివ్ మార్కులు కూడా ఉంటాయి.

ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కులు కోత విధిస్తారు.

ప్రిలిమినరీలో క్వాలిఫై అయిన అభ్యర్థులను మెయిన్స్ కు ఎంపికవుతారు.

మెయిన్ పరీక్ష:

మెయిన్ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది.

ఇందులో మొత్తం 190 ప్రశ్నలు ఇస్తారు.

మెయిన్ పరీక్షలో 4 విభాగాలుంటాయి.

1. జనరల్ /ఫైనాన్షియల్ అవేర్నెస్ 50 ప్రశ్నలు 50 మార్కులకు ఉంటుంది.

2. జనరల్ ఇంగ్లిష్ 40 ప్రశ్నలకు 40 మార్కులు కేటాయిస్తారు.

3. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 ప్రశ్నలకు 50 మార్కులు ఉంటాయి.

4. రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 50 ప్రశ్నలకు 60 మార్కులు కేటాయిస్తారు.

వైరల్ వీడియో.. డాక్టర్ ఎదురుగా గుండె పోటుతో కుప్పకూలిన పేషెంట్, పరుగున వచ్చి రోగి ఛాతిపై సీపీఆర్‌ చేసి బతికించిన డాక్టర్

పరీక్ష సమయం: 2 గంటల 40 నిమిషాలు.

పరీక్షా కేంద్రాలు: అనంతపూర్, భీమవరం, చీరాల, గూడూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, రాజమండ్రి, రాజంపేట, శ్రీకాకుళం, తాడేపల్లి గూడెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్.

దరఖాస్తు: ఆన్‌లైన్ లో దరఖాస్తు చేయాలి.

దరఖాస్తు ప్రారంభం: 7.09.2022.

చివరి తేదీ: 27.09.2022.

పరీక్ష తేదీ: ప్రిలిమినరీ పరీక్ష నవంబర్, 2022 లో, మెయిన్ పరీక్ష డిసెంబర్ 2022/జనవరి 2023 లో నిర్వహిస్తారు.

వెబ్ సైట్: https://sbi.co.in