Bank Holidays in March 2021: మార్చి నెలలో 11 రోజులు బ్యాంకులకు సెలవులు, మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా లావాదేవీలు యథావిధిగా పనిచేస్తాయని తెలిపి బ్యాంక్ అధికారులు
The Reserve Bank of India (RBI) |

Mumbai, Feb 28: మార్చి నెలలో బ్యాంకులు 11 రోజుల వరకు దేశవ్యాప్తంగా మూతపడనున్నాయి. ఇందులో నాలుగు ఆదివారాలు, రెండు శనివారాలు ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ క్యాలెండర్ ప్రకారం మార్చి నెలలో వివిధ రాష్ట్రాల్లో ఐదు రోజులు సెలవు దినాలు (Bank Holidays in March 2021) ఉండనున్నాయి. ఈ సెలవులు రాష్ట్రాలను బట్టి మారుతాయి. మార్చి 5, 11, 22, 29, 30వ తేదీల్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయని ఆర్బీఐ మార్గదర్శకాలు వెల్లడించాయి.

మార్చి నెలలో ఆయా బ్యాంకులకు వెళ్లాలని అనుకునే వారు సెలవులకు (Banks to Remain Closed for 11 Days) అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని బ్యాంకు అధికారులు సూచించారు. మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా లావాదేవీలు యథావిధిగా పనిచేస్తాయి. వినియోగదారులు ఆన్‌లైన్ ద్వారా లావాదేవీలు చేసుకోవచ్చు.

మార్చి 2021లో బ్యాంకు సెలవులు:

5 మార్చి 2021: చాప్చర్ కుట్ (మిజోరం)

7 మార్చి 2021: ఆదివారం

11 మార్చి 2021: మహాశివరాత్రి

13 మార్చి 2021: రెండవ శనివారం

14 మార్చి 2021: ఆదివారం

21 మార్చి 2021: ఆదివారం

22 మార్చి 2021: బీహార్ డే

27 మార్చి 2021: నాల్గవ శనివారం

28 మార్చి 2021: ఆదివారం

29 మార్చి 2021: ధూలేటి/యోసాంగ్ రెండవ రోజు

30 మార్చ్ 2021: హోలీ

అలాగే, బ్యాంకింగ్ రంగాన్ని ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తున్న నేపథ్యంలో దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సమ్మెకు పలు బ్యాంకు యూనియన్లు పిలుపునివ్వడంతో మార్చిలో రెండు రోజులు బ్యాంకులు మూసివేయనునట్లు తెలుస్తుంది. రెండు రోజుల సుదీర్ఘ సమ్మెకు మార్చి 15, 16 తేదీల్లో చేపట్టనున్నారు.