Amaravathi, Novemebr 9: బంగాళాఖాతంలో కొనసాగుతున్న ‘బుల్‌బుల్’ తుఫాన్ (Cyclone Bulbul ) అతి తీవ్ర తుఫాన్‌గా మారింది. పారాదీప్‌కు దక్షిణ ఆగ్నేయ దిశగా 310 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్ కు దక్షిణ నైరుతి దిశగా 450 కిలోమీటర్లు, బంగ్లాదేశ్‌కు దక్షిణ నైరుతి దిశగా 550 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. శనివారం అర్ధరాత్రి పశ్చిమ బెంగాల్ సాగర్ దీవులు, బంగ్లాదేశ్ ఇది మధ్య తీరం దాటే అవకాశం ఉందని, ఈ కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. ఒడిసా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో శనివారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్(Andhra pradesh)పై తీవ్ర ప్రభావం చూపించే ఈ బుల్‌బుల్ తుఫాన్ తీరం వైపు దూసుకొస్తోంది. తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఒడిసా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. ఒడిషా తీరప్రాంతంలో గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచి 90 కిలోమీటర్ల వేగం పుంజుకునే అవకాశం ఉంది.