Newdelhi, May 24: బంగాళాఖాతంలో (Bay of Bengal) ఏర్పడిన తీవ్ర తుపాను (Cyclone) రెమాల్ (Remal) బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరాలకు దూసుకోస్తున్నట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఈ రుతుపవనాల సీజన్‌లో బంగాళాఖాతంలో ఏర్పడిన తొలి తుఫాను ఇదే. శుక్రవారం ఉదయం నాటికి ఈ వ్యవస్థ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారుతుందని IMD శాస్త్రవేత్త మోనికా శర్మ తెలిపారు.శనివారం ఉదయం ఇది తుఫానుగా మారి ఆదివారం సాయంత్రానికి తీవ్ర తుపానుగా మారి బంగ్లాదేశ్ మరియు పశ్చిమ బెంగాల్ తీరానికి చేరుకుంటుందని ఆమె తెలిపారు. IMD ప్రకారం, ఆదివారం, తుఫాను గంటకు 102 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.
బెంగాల్ లో అతి భారీ వర్షాలు
పశ్చిమ బెంగాల్, మిజోరం, త్రిపురలోని కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. , దక్షిణ మణిపూర్, ఉత్తర ఒడిశాలో మే 27 వరకు బంగాళాఖాతంలోకి వెళ్లవద్దని సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగి తీరానికి వెళ్లాలని సూచించారు. వెచ్చని సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల కారణంగా, తుఫానులు వేగంగా బలపడుతున్నాయని, ఎక్కువ కాలం వాటి శక్తిని నిలుపుకుంటాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.
Thereafter, to continue moving northeastwards, intensify further as cyclonic storm over eastcentral BOB by 25th May morning. Subsequently, it would move nearly northwards and reach near Bangladesh and adjoining West Bengal coasts by 26th May evening as a severe cyclonic storm.
— India Meteorological Department (@Indiametdept) May 23, 2024
తెలుగు రాష్ట్రాలకు భయం లేదు
బంగాళాఖాతంలోని తీవ్ర తుఫాన్ వల్ల తెలుగు రాష్ట్రాలకు ఎలాంటి ప్రమాదం లేదని.. పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాలకు భారీ నష్టం ఉండొచ్చని హెచ్చరిస్తూ.. ఆయా రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఏపీపై తుఫాన్ ప్రభావం తక్కువగానే ఉంటుందని ఐఎండీ వెల్లడించింది. మత్యకారులు, నావికులకు హెచ్చరికలు జారీ చేసింది. సముద్రం అల్లకల్లోలంగా మారుతున్నందున అప్రమత్తంగా వుండాలని సూచించింది.